AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: వచ్చే వారం వరుసగా 6 రోజులు బ్యాంకులకు సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Bank Holidays: సోమవారం నుంచి ఆరు రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. చెక్ బుక్ రిక్వెస్ట్ చేయడం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా లోన్ అప్లికేషన్లు వంటి నేరుగా బ్రాంచ్‌కు వెళ్లి చేయాల్సిన పనులేవైనా ఉంటే, ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం..

Bank Holidays: వచ్చే వారం వరుసగా 6 రోజులు బ్యాంకులకు సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
Bank Holidays in May 2026: మే నెలలో బ్యాంకు లావాదేవీలు నిర్వహించే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక సమాచారం అందించింది. పండుగలు, వారాంతపు సెలవుల కారణంగా వచ్చే నెలలో మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. ఈ సెలవుల జాబితాను గమనించకుండా ప్లాన్ చేసుకుంటే ఇబ్బందులు తప్పవు.
Subhash Goud
|

Updated on: Mar 29, 2026 | 9:14 AM

Share

Bank Holidays: వచ్చే వారం బ్యాంకింగ్ పనుల నిమిత్తం బ్రాంచ్‌లకు వెళ్లేవారు ఒకసారి క్యాలెండర్‌ను తనిఖీ చేసుకోవడం మంచిది. మార్చి 30 నుండి ఏప్రిల్ 5, 2026 మధ్య కాలంలో మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే వంటి పండుగలు, వార్షిక ముగింపు (Annual Closing) కారణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు సుమారు 6 రోజుల పాటు మూతపడనున్నాయి.

వచ్చే వారం బ్యాంక్ సెలవుల జాబితా (మార్చి 30 – ఏప్రిల్ 5):

ఆర్‌బీఐ (RBI) సెలవుల జాబితా ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి:

  • మార్చి 30 (సోమవారం) – మహావీర్ జయంతి: కర్ణాటకలో బ్యాంకులకు సెలవు.
  • మార్చి 31 (మంగళవారం) – మహావీర్ జన్మకళ్యాణక్: గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో సెలవు.
  • ఏప్రిల్ 1 (బుధవారం) – బ్యాంకుల వార్షిక ముగింపు (Annual Closing): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దాదాపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇది ఖాతాల వార్షిక ముగింపు ప్రక్రియ కోసం కేటాయించిన రోజు.
  • ఏప్రిల్ 2 (గురువారం) – మౌండీ థర్స్ డే (Maundy Thursday): కేరళలో బ్యాంకులకు సెలవు.
  • ఏప్రిల్ 3 (శుక్రవారం) – గుడ్ ఫ్రైడే: తెలుగు రాష్ట్రాలు (AP, Telangana), ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో సెలవు.
  • ఏప్రిల్ 5 (ఆదివారం): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సాధారణ వారాంతపు సెలవు.

గమనిక: ఏప్రిల్ 4 శనివారం (మొదటి శనివారం) కావడంతో ఆ రోజు బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి. సాధారణంగా బ్యాంకులు నెలలో 2వ, 4వ శనివారాల్లో మాత్రమే మూతపడతాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Raymond: ఇది అందరికీ ఒక గుణపాఠమే.. అన్నీ ఇచ్చి చివరకు అద్దె ఇంట్లో నివాసం.. ఒక తప్పు రేమండ్‌ అధినేత జీవితాన్ని మార్చేసింది!

ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయా?

బ్యాంక్ బ్రాంచ్‌లు భౌతికంగా మూతపడినప్పటికీ, డిజిటల్ సేవలకు ఎటువంటి ఆటంకం ఉండదు. కింది సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి. UPI లావాదేవీలు: (Google Pay, PhonePe, Paytm మొదలైనవి). అందుబాటులో ఉంటాయి. అలాగే నెట్ బ్యాంకింగ్ అండ్‌ మొబైల్ బ్యాంకింగ్, నగదు బదిలీ (IMPS, NEFT, RTGS) కోసం, నగదు ఉపసంహరణ కోసం ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి.

ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..

ముందస్తు ప్రణాళిక ముఖ్యం:

చెక్ బుక్ రిక్వెస్ట్ చేయడం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా లోన్ అప్లికేషన్లు వంటి నేరుగా బ్రాంచ్‌కు వెళ్లి చేయాల్సిన పనులేవైనా ఉంటే, ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. స్థానిక పండుగలను బట్టి సెలవులు రాష్ట్రానికీ రాష్ట్రానికీ మారవచ్చు. సందేహం ఉంటే మీ సమీప బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us