AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. జూన్‌లో బ్యాంకులకు అన్ని రోజులు సెలవులా? పనిదినాలు ఎన్నంటే?

జూన్ 2026లో ప్రాంతీయ, మతపరమైన పండుగలు, రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మొత్తం 11 రోజుల పాటు మూసివేయబడనున్నాయి. మొహర్రం, రాజా సంక్రాంతి, వైఎంఏ డే, కబీర్ జయంతి వంటి సందర్భాల్లో పలు రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది.

వామ్మో.. జూన్‌లో బ్యాంకులకు అన్ని రోజులు సెలవులా? పనిదినాలు ఎన్నంటే?
Bank Holidays
SN Pasha
|

Updated on: May 30, 2026 | 8:44 AM

Share

జూన్ 2026 నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు మొత్తం 11 రోజుల పాటు బంద్‌ ఉండనున్నాయి. ప్రాంతీయ, మతపరమైన పండుగలు, అలాగే రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాల కారణంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. ఈ నేపథ్యంలో ఖాతాదారులు తమ బ్యాంకింగ్ లావాదేవీలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సూచిస్తోంది. ఆర్‌బీఐ విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం, జూన్ 15న మిజోరంలో యంగ్ మిజో అసోసియేషన్ (వైఎంఏ) దినోత్సవం సందర్భంగా, అలాగే ఒడిశాలో రాజా సంక్రాంతి పండుగ కారణంగా బ్యాంకులకు సెలవు ఉంది. ఈ రోజున రెండు రాష్ట్రాల్లోని అన్ని బ్యాంకు శాఖలు పనిచేయవు.

ఇక మొహర్రం సందర్భంగా జూన్ 25న ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అనంతరం జూన్ 26న మొహర్రం, ఆషూరా సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, త్రిపుర, మిజోరం తదితర రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడనున్నాయి. అదేవిధంగా జూన్ 29న సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో, ‘రేమ్నా నీ’ ప్రాంతీయ పండుగ కారణంగా మిజోరంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

పండుగలతో పాటు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ప్రతి నెలా రెండవ, నాలుగవ శనివారాల్లో దేశవ్యాప్తంగా అన్ని షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు మూసివేయబడతాయి. అలాగే అన్ని ఆదివారాలు కూడా బ్యాంకులకు సెలవులే. ఈ కారణంగా జూన్ నెలలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకు శాఖలు పనిచేయవు. అయితే బ్యాంకు శాఖలు మూసివేసినా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ వంటి డిజిటల్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అయినప్పటికీ చెక్కుల క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, ఇతర శాఖాపరమైన సేవలు అవసరమైన వారు ముందుగానే తమ పనులను పూర్తి చేసుకోవాలని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
గులాబీలు విరగ పూయాలి అంటే ఇది ఒక్క స్పూన్ వేయండి చాలు
గులాబీలు విరగ పూయాలి అంటే ఇది ఒక్క స్పూన్ వేయండి చాలు
నూనె ట్యాంకర్ బోల్తా.. ఆ తర్వాత సీన్ ఇదే! వీడియో వైరల్
నూనె ట్యాంకర్ బోల్తా.. ఆ తర్వాత సీన్ ఇదే! వీడియో వైరల్
ఇలా కూడా ఔటవుతారా.. ఆ ఒక్క తప్పుతో ఊహించని షాకిచ్చిన అంపైర్..
ఇలా కూడా ఔటవుతారా.. ఆ ఒక్క తప్పుతో ఊహించని షాకిచ్చిన అంపైర్..
ఈ కామర్స్ కంపెనీలకు షాక్.. ఆన్‌లైన్ లో ఈ పండు కొంటే నేరమే!
ఈ కామర్స్ కంపెనీలకు షాక్.. ఆన్‌లైన్ లో ఈ పండు కొంటే నేరమే!
జలుబు పట్టిందా? మందులకంటే ముందు ఈ డ్రింక్స్ ట్రై చేయండి!
జలుబు పట్టిందా? మందులకంటే ముందు ఈ డ్రింక్స్ ట్రై చేయండి!
OTTలో భయానక హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది.. పెద్దలకు మాత్రమే
OTTలో భయానక హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది.. పెద్దలకు మాత్రమే
మనసున్న కలెక్టర్ .. మాన‌వ‌త్వంతో స్పందించారు
మనసున్న కలెక్టర్ .. మాన‌వ‌త్వంతో స్పందించారు
యూపీఐ ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తే ఐటీ నోటీసులొస్తాయా?
యూపీఐ ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తే ఐటీ నోటీసులొస్తాయా?
గిల్‌కు ఇచ్చిపడేసిన పంత్.. డబ్ల్యూటీసీలో తోపుగాడిగా భారీ రికార్డ్
గిల్‌కు ఇచ్చిపడేసిన పంత్.. డబ్ల్యూటీసీలో తోపుగాడిగా భారీ రికార్డ్
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..