Budget 2022: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ఉపన్యాసంతో మొదలయ్యాయి. రేపు అంటే ఫిబ్రవరి 1 వతేదీ ఉదయం 11 గంటలకు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడతారు. బడ్జెట్ ప్రవేశ పెట్టేముందుగా ఈరోజు పార్లమెంట్ లో ఆర్ధిక సర్వే ను నిర్మల సీతారామన్ సమర్పించారు. ఈ ఆర్ధిక సర్వే ప్రకారం 2022-23లో జీడీపీ (GDP) వృద్ధి (ఆర్థిక వృద్ధి రేటు) 8-8.5%గా అంచనా వేశారు. ఇది 2021-22 వృద్ధి అంచనా 9.2% కంటే తక్కువ. వాక్సిన్ కవరేజ్ సరఫరా వైపు సంస్కరణలు వృద్ధికి తోడ్పడతాయని ఆర్థిక సర్వే పేర్కొంది. మహమ్మారి వల్ల తదుపరి ఆర్థిక కార్యకలాపాలు ఏవీ ప్రభావితం కావు. రుతుపవనాలు కూడా సాధారణంగా ఉంటాయనే ఊహ ఆధారంగా ప్రభుత్వం GDP అంచనా వేసింది. అంటే రుతుపవనాల ప్రభావం లేదా మహమ్మారి మళ్ళీ తీవ్రంగా ప్రభావం చూపిస్తే అప్పుడు జీడీపి తగ్గవచ్చు.
ఆర్థిక సర్వే ప్రకారం, పునరుత్పాదక ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు ఉన్నప్పటికీ, నీతి ఆయోగ్ జాతీయ ఇంధన విధానం ముసాయిదా ఆధారంగా బొగ్గు డిమాండ్ లో మార్పు ఉండదు. అలాగే 2030 నాటికి 130-150 మిలియన్ టన్నుల బొగ్గు డిమాండ్ ఉంటుంది.
IT-BPO రంగం 2.26% రేటుతో వృద్ధి చెందింది
సర్వే ప్రకారం, ఇ-కామర్స్ మినహా, IT-BPO రంగం 2020-21 ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి 2.26% పెరిగి $19.4 ట్రిలియన్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 3.9% చొప్పున వృద్ధి చెందుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 3.6% చొప్పున వృద్ధి చెందింది.
GDP ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని చూపుతుంది
ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగించే అత్యంత సాధారణ సూచికలలో GDP ఒకటి. GDP అనేది ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో దేశంలో ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువులు సేవల విలువను సూచిస్తుంది. ఇందులో దేశ సరిహద్దుల్లో ఉత్పత్తి చేసే విదేశీ కంపెనీలను కూడా చేర్చారు. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నిరుద్యోగం స్థాయిలు సాధారణంగా తక్కువగా ఉంటాయి.
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందా?
జీడీపీ గణాంకాలు చూస్తుంటే ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తోంది. కానీ అన్ని లెక్కలు కలిపి చూసినపుడు దీని చిత్రం భిన్నంగా కనిపిస్తుంది. వాస్తవానికి, మార్చి 2020లో, కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. తరువాత లాక్ డౌన్ తెరిచారు, కానీ ఇప్పటికీ అది పూర్తిగా తెరుచుకోలేదు. దీని ప్రభావం GDP బేస్ పడిపోయింది అది -7.3% వద్ద నిలిచింది. బేస్ చాలా తక్కువగా ఉన్నప్పుడు, కొద్దిగా బౌన్స్ కూడా పెద్ద దిద్దుబాటు భ్రమను సృష్టిస్తుంది.
దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. 2019లో దేశ జిడిపి 1000 రూపాయలు అనుకుందాం. 2020లో 7.3% పతనం తర్వాత, రూ.927కి తగ్గింది. ఇప్పుడు అది 2021లో 9.2% పెరిగితే, అది పెరిగింది, కానీ 1012కి మాత్రమే చేరుకుంది. అంటే, 2020తో పోల్చితే ఇది మంచి పెరుగుదల అయితే 2019 కంటే చాలా తక్కువ.
గత సంవత్సరాలతో పోల్చినప్పుడు GDP గణాంకాలు ఏమి చెబుతున్నాయి?
ఆర్థిక సర్వేలో, 2022 సంవత్సరంలో GDP వృద్ధి 8.0-8.5%గా ఉండవచ్చని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇది 2021లో 9.2% అంచనా కంటే తక్కువ. అంతకుముందు 2020లో, కరోనా ప్రభావిత సంవత్సరంలో GDP వృద్ధి రేటు -7.3%. అంటే, కరోనా మొదటి వేవ్ ద్వారా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు రికవరీ మోడ్‌లో ఉంది. అదే సమయంలో, కరోనా కాలానికి ముందు, 2019లో దేశ జిడిపి 6.5%.
ఆర్థిక సర్వే అంటే ఏమిటి?
మధ్యతరగతి ప్రజల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్న దేశంలో మనం జీవిస్తున్నాం. మనలో చాలామంది ఇంట్లో డైరీ రాస్తుంటారు. సాధారణంగా మన ఇళ్లలో డైరీ అంటే ప్రతిరోజూ వారీ ఖర్చులు.. ఆదాయాల వివరాలను నింపి పెడుతుంటారు. నిజానికి డైరీ అరధం వేరైనా మనలో ఎక్కువమంది చేసే పని ఇదే. సంవత్సరం పూర్తయిన తరువాత ఆ డైరీని చూస్తె మన ఇంట్లో ఖర్చులు ఎలా చేశాం.. ఆదాయం ఎలా వచ్చింది. పొడుపు ఎంత చేశాం.వంటి వివరాలు అన్నీ అందులో ఉంటాయి. దాని ఆధంగా మనం వచ్చే సంవత్సరంలో ఖర్చులు ఎలా పెట్టాలి? పొడుపు ఎలా చేయాలి వంటి ఆర్ధిక అంశాలను నిర్ణయించుకుంటాం.
సరిగ్గా ఇటువంటిదే దేశ ఆర్థిక సర్వే కూడా. ఇది అచ్చు మన మన ఇంటి డైరీ లాంటిదే. ఆర్ధిక సర్వే మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆర్థిక సర్వేలో, గత సంవత్సరం లెక్కలు..రాబోయే సంవత్సరానికి సూచనలు, సవాళ్లుఅలాగే పరిష్కారాలను ప్రస్తావిస్తారు. బడ్జెట్‌కు ఒకరోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు.
ఇవి కూడా చదవండి: Budget 2022: ఈ సారి కూడా పూర్తిగా పేపర్‌లెస్ బడ్జెటే.. ఆ వేడుక రద్దు.. వివరాలివే..
Budget2022: బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్ధిక మంత్రి ఉపయోగించే పదాలకు అర్ధాలు తెలుసా?