విజయవంతంగా ‘పినాక’ ప్రయోగం

|

Nov 04, 2020 | 6:32 PM

భారత ఆయుధ సంపత్తిలో మరో కలికి తురాయి చేరింది. ఆధునీకరించిన రాకెట్లను డీఆర్డీఓ బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. భారత ఆర్మీ దగ్గరున్న పినాక రాకెట్ల స్థానంలో ఆధునీకరించిన పినాక రాకెట్లను చేర్చేందుకు డీఆర్డీఓ రెడీ అవుతోంది.

విజయవంతంగా ‘పినాక’ ప్రయోగం
Follow us on

DRDO test-fired Pinaka successfully: ఆధునిక ఆయుధాలను, అత్యాధునిక క్షిపణుల ప్రయోగాలలో దూకుడును ప్రదర్శిస్తున్న డీఆర్డీఓ బుధవారం మరో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి బుధవారం నిర్వహించిన ప్రయోగంలో ఒకేసారి ఆరు రాకెట్లను టెస్ట్ చేశారు. ఆరింటికి ఆరు విజయవంతంగా లక్ష్యాలను ఛేదించాలని డీఆర్డీఓ ప్రకటించింది.

గతంలోనే రూపొందించిన పినాక రాకెట్లను మరింత ఆధునికంగా పునరుత్పత్తి చేసిన డీఆర్డీఓ ఒడిశా తీరం నుంచి వాటిని ప్రయోగించి విజయవంతమైంది. ప్రయోగించిన ఆరు రాకెట్లు టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ప్రకారం ఖచ్చితంగా నిర్దేశిత లక్ష్యాలను ఛేదించాయని డీఆర్డీఓ అధికారులు తెలిపారు.

తాజాగా ఆధునీకరించిన పినాక రాకెట్లను ప్రస్తుతం ఆర్మీ దగ్గరున్న పాత పినాక రాకెట్ల స్థానంలో రీప్లేస్ చేస్తామని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. పరమ శివుని బాణం పేరిట పినాకగా నామకరణం చేసిన ఈ రాకెట్లు ఇదివరకే భారత ఆర్మీ వద్ద వున్నాయి. వాటిని పాకిస్తాన్, చైనా సరిహద్దులో మోహరించారు. తాజాగా ఆధునీకరించిన రాకెట్లను సైతం రెండు దేశాల సరిహద్దుకు ఆర్మీ తరలించనున్నది.

ALSO READ: ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్.. కేసుల్లో మరింత తీవ్రత

ALSO READ: సిట్టింగ్ లీడర్ల కేసులపై వున్న కేసులకే తొలి ప్రాధాన్యం

ALSO READ: స్కూళ్ళ రీఓపెనింగ్‌పై తమిళ సర్కార్ వెనుకంజ

ALSO READ: వరాహస్వామి ఆలయానికి బంగారు తాపడం

ALSO READ: సాగర తీరానికి కొత్త సొబగులు..ఇక రాత్రంతా..!

ALSO READ: రెండు రాష్ట్రాల్లో మళ్ళీ భారీ వర్షాలు