కుంగిన రోడ్డు.. ప్రమాదంలో మెట్రో పిల్లర్

|

Oct 14, 2020 | 5:08 PM

అసాధారణ స్థాయిలో హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు ఇపుడు మెట్రో రైలుకు ప్రమాదాన్ని తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా ఎల్బీనగర్-మియాపూర్ మార్గానికి హానికరంగా...

కుంగిన రోడ్డు.. ప్రమాదంలో మెట్రో పిల్లర్
Follow us on

Danger for Hyderabad Metrorail: అసాధారణ స్థాయిలో హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు ఇపుడు మెట్రో రైలుకు ప్రమాదాన్ని తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా ఎల్బీనగర్-మియాపూర్ మార్గానికి హానికరంగా మారాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో నగరంలోని పలు రోడ్లు తెగిపోయాయి.. పలు చోట్ల రోడ్లు కుంగిపోయాయి. దాంతో మెట్రో మార్గాలకు ప్రమాదం పొంచి వుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మియాపూర్-ఎల్బీనగర్ మెట్రో మార్గంలో మూసాపేట స్టేషన్ వద్ద మెట్రో పిల్లర్‌ను ఆనుకుని వున్న రోడ్డు కుంగిపోయింది. సరిగ్గా పిల్లర్‌కు చుట్టూ వున్న రోడ్డు కుంగిపోవడంతో దాని ప్రభావం పిల్లర్‌పై పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక పిల్లర్ చుట్టూ రోడ్డు కుంగిపోగా.. దాని పక్కనే వున్న మరో పిల్లర్ చుట్టూ కూడా సగం వరకు రోడ్డు కుంగిపోయింది. చుట్టూ రోడ్డు కుంగిన నేపథ్యంలో పిల్లర్ పటుత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, రోడ్డు కుంగిన విషయం తెలియని మెట్రో రైల్ అధికారులు మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో మెట్రో రైళ్లను నడుపుతూనే వున్నారు. నగరంలో రోడ్డు రవాణా వ్యవస్థ పాక్షికంగా దెబ్బతిన్న నేపథ్యంలో మెట్రో రైలుపై ఆధారపడే ప్రయాణికుల సంఖ్య అధికంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లర్ కుంగిన విషయాన్ని పలువురు మెట్రో అధికారులకు తెలియ జేశారు. ప్రస్తుతం పిల్లర్ చుట్టూ వున్న నీటిని తోడేసిన అధికారులు.. మరోసారి భారీ వర్షం వస్తే ఏంటన్నది ఇపుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. అయితే మెట్రో ఇంజనీర్లు ప్రస్తుతం మూసాపేట దగ్గర పరిస్థితిని పరిశీలిస్తున్నారని, దగ్గరలోని చెరువు కట్ట తెగడం వల్లనే రోడ్డు కుంగిందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇంజనీర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన ఓ ప్రకటనలో తెలియజేశారు.

Also read: రెండోతరం వాక్సిన్‌తోనే సాధారణ స్థితి

Also read: చంద్రబాబుకు ఛాన్సివ్వండి..హైకోర్టు ఆదేశం

Also read: అక్టోబర్ 28న కృష్ణా రివర్ బోర్డు భేటీ

Also read: నవంబర్ 9న రాజ్యసభ ఎన్నికలు

Also read: కోలుకున్న గేల్.. బెంగళూరుతో మ్యాచ్‌కు రెడీ