కశ్మీర్ కీ ‘ కహానీ ‘.. అసలు 370 అధికరణంలో ఏముంది ?

|

Aug 05, 2019 | 1:16 PM

జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్రం సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. అలాగే ఆర్టికల్ 35 ఏ రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 అధికరణం రద్దుకు సంబంధించి రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. అయితే సభలో కేంద్ర ప్రకటనపై పెద్దఎత్తున రభస జరిగింది. ఇది రాజ్యాంగాన్ని హతమార్చడమేనని ప్రతిపక్షాలు […]

కశ్మీర్ కీ  కహానీ .. అసలు 370 అధికరణంలో ఏముంది ?
Follow us on

జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్రం సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. అలాగే ఆర్టికల్ 35 ఏ రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 అధికరణం రద్దుకు సంబంధించి రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. అయితే సభలో కేంద్ర ప్రకటనపై పెద్దఎత్తున రభస జరిగింది. ఇది రాజ్యాంగాన్ని హతమార్చడమేనని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. పెద్దఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశాయి. చైర్మన్ వెంకయ్యనాయుడు కొద్దిసేపు ప్రత్యక్ష ప్రసారాలను కూడా నిలిపివేయవలసి వచ్చింది. అసలు సభలో ఇంత రభసకు కారణమైన ఆర్టికల్ 370 అంటే..
భారత రాజ్యాంగం ప్రకారం.. ఈ అధికరణం జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తోంది. 1956 లో రాజ్యాంగం నుంచి తొలగించిన 238 అధికరణం లోని నిబంధనలు ఈ రాష్ట్రానికి వర్తించవని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. (అప్పుడు దేశంలోని రాష్ట్రాల పునర్విభజన జరిగింది). 1949 లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు.. అప్పటి న్యాయ శాఖ మంత్రి అయిన షేక్ అబ్దుల్లాను రాజ్యాంగంలో ఇందుకు అనువైన ముసాయిదాను సిధ్ధం చేయాలని, ఇందుకు అంబెడ్కర్ ను సంప్రదించాలని సూచించారు. అనంతరం గోపాలస్వామి అయ్యంగార్ ఆర్టికల్ 370 ముసాయిదాను రూపొందించారు. తొలి భారత ప్రభుత్వంలో ఆయన నాడు పోర్టు ఫోలియో లేని మంత్రిగా వ్యవహరించారు.
రాజ్యాంగంలోని పద కొండో భాగాన్ని సవరిస్తూ కశ్మీర్ కు తాత్కాలిక నిబంధనలను వర్తింపజేశారు. నాడు కాన్స్ టి ట్యూయెంట్ అసెంబ్లీగా ఉన్న సభను ఆ తరువాత అసెంబ్లీగా మార్చడానికి ఉద్దేశించారు. ఈ ఆర్టికల్ కింద ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. అంటే ఇక్కడి ప్రజలకు ఇతర భారతీయుల మాదిరి కాక ప్రత్యేక హక్కులు కల్పించారు. ఈ అధికరణం ప్రకారం.. ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇతర రాష్ట్రాల కన్నా అదనంగా నిధులు అందుతాయి. అలాగే కేంద్ర పన్నుల వాటాలో కశ్మీర్ ప్రత్యేక ప్రయోజనం పొందుతుంది. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఈ రాష్ట్రం తమ పన్నులను కేంద్రానికి చెల్లించనక్కరలేదు. ఇంకా ఇలాంటి సౌలభ్యాలెన్నో ఈ ఆర్టికల్ కింద ఈ రాష్ట్రానికి సంక్రమించాయి. భౌగోళికంగా, ఆర్థికంగా దీన్ని వెనుకబడిన రాష్ట్రంగా గుర్తించడానికి కూడా ఈ ఆర్టికల్ వీలు కల్పించింది.
1952 నంబరు 15 న ఈ రాష్ట్రానికి అసెంబ్లీని ఏర్పాటు చేస్తూ..దాని సిఫారసులపై రాష్ట్రపతి గుర్తించిన ‘ సదర్-ఏ-రియాసత్ ‘ (ప్రస్తుత గవర్నర్) ను నియమించాలని అప్పటి ప్రభుత్వం సూచించింది. ఈ అధికరణం ప్రకారం ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక చట్టాలు కూడా వర్తింప జేయడం విశేషం. పౌరసత్వం, ఆస్తులకు ఓనర్ షిప్, ఇతర ప్రాథమిక హక్కులు తదితరాలకు వీరు అర్హులయ్యారు.
ఇక ఆర్టికల్ 35 ఏ అధికరణం విషయానికి వస్తే.. ముఖ్యంగా ఇది రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉండడానికి, ఆస్తులు సంపాదించడానికి ఎవరు అర్హులన్న విషయాన్ని నిర్దేశిస్తోంది. అలాగే.. 1954 మే 14 వ తేదీకన్నా ముందు లేదా ఆతరువాత రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి..లేదా 10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో నివసించిన వ్యక్తి కశ్మీర్ శాశ్వత నివాసి అవుతాడు. ఆ వ్యక్తి రాష్ట్రంలో స్థిరాస్తి కలిగి
ఉండవచ్ఛు. ఇలాంటి ప్రత్యేక ప్రయోజనాలను బీజేపీ వ్యతిరేకిస్తోంది.
కాగా-కశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఈ 370 అధికారణాన్ని పాలక బీజేపీ ఏనాటి నుంచో వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ అంశాన్ని తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది కూడా. తాజాగా ఈ ఆర్టికల్ ని రద్దు చేయడంతో ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలు చేసినట్లయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ పీడీపీ వంటి సభ్యులు పెద్దఎత్తున రభసకు పూనుకొన్నారు. కొందరు రాజ్యాంగ ప్రతులను చించివేశారు. వారిని సభనుంచి బలవంతంగా బయటికి మార్షల్స్ తీసుకువెళ్లాల్సి వచ్చింది.