Bigg Boss 4: గంగవ్వకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శుభాకాంక్షలు

| Edited By:

Sep 07, 2020 | 3:22 PM

బుల్లితెరపై బిగ్‌బాస్ 4 సందడి ప్రారంభమైంది. వరుసగా రెండోసారి ఈ షోకు వ్యాఖ్యాతగా వచ్చిన కింగ్‌ నాగార్జున 16 మంది కంటెస్టెంట్‌లను

Bigg Boss 4: గంగవ్వకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శుభాకాంక్షలు
Follow us on

Gangavva in Bigg Boss 4: బుల్లితెరపై బిగ్‌బాస్ 4 సందడి ప్రారంభమైంది. వరుసగా రెండోసారి ఈ షోకు వ్యాఖ్యాతగా వచ్చిన కింగ్‌ నాగార్జున 16 మంది కంటెస్టెంట్‌లను పరిచయం చేసి, హౌజ్‌లోకి పంపారు. ఇక ఈ సీజన్‌లో యూట్యూబ్‌ సంచలనం గంగవ్వ కూడా పాల్గొనగా.. ఆమె పేరిట అప్పుడే బయట ఆర్మీని స్టార్ట్ చేశారు. అభిమానులు సోషల్ మీడియాలో గంగవ్వ పేరిట ట్వీట్లు హోరెత్తిస్తున్నారు. దీంతో ఇప్పుడు గంగవ్వ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు కొందరేమో ఈ సీజన్ విన్నర్ గంగవ్వ అంటూ తేల్చేస్తున్నారు. ఇదిలా ఉంటే  టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సైతం గంగవ్వకు మద్దతుగా నిలిచారు.

ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన సుంకె రవిశంకర్.. ”మా చొప్పదండి నియోజకవర్గ అవ్వ గంగవ్వ బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు. మారుమూల పల్లె నుండి తన మాటలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. గంగవ్వ విజేతగా నిలుస్తుందని ఆశిస్తున్నాను” అని కామెంట్ పెట్టారు. మరోవైపు ఇవాళ ఎపిసోడ్‌లో భాగంగా స్టార్‌ మా ఓ ప్రోమోను విడుదల చేసింది. అందులో నామినేట్‌ ప్రక్రియలో భాగంగా గంగవ్వ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More:

సుశాంత్‌ కేసు.. బాలీవుడ్‌పై సీబీఐ దృష్టి

శారీరకంగానే కాదు ఆలోచనల్లోనూ బలంగా ఉండాలి.. అందుకే: జగన్