శారీరకంగానే కాదు ఆలోచనల్లోనూ బలంగా ఉండాలి.. అందుకే: జగన్

నేటి బాలలే రేపటి పౌరులని, వారికి పౌష్టికాహారం లేకపోతే ఎదుగుదల ఉండదని, అందుకోసమే సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించిట్లు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు

శారీరకంగానే కాదు ఆలోచనల్లోనూ బలంగా ఉండాలి.. అందుకే: జగన్
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2020 | 2:12 PM

ysr complete nutrition scheme: నేటి బాలలే రేపటి పౌరులని, వారికి పౌష్టికాహారం లేకపోతే ఎదుగుదల ఉండదని, అందుకోసమే సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించిట్లు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల కంటే మరింత మెరుగ్గా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తామని అన్నారు.

రాష్ట్రంలో గర్భిణీల్లో 53శాతం మందికి రక్తహీనత ఉందని, తక్కువ బరువున్న పిల్లలు సుమారు 32 శాతం మంది ఉన్నారని సీఎం అన్నారు. పిల్లలు శారీరకంగానే కాదు చదువు, ఆలోచనల్లో బలహీనులుగా ఉండకూడదనే ఈ పథకాలు పెట్టినట్లు ఆయన వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మార్చబోతున్నామని.. 55,607 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తామని జగన్ తెలిపారు. ఏడు మండలాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలు చేస్తున్నామని.. త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో అంగన్‌వాడీ కేంద్రాలను మరింత అభివృద్ధి చేస్తామని, పేదలకు మంచి జరిగేలా పథకాన్ని సమర్థంగా అమలు చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Read More:

ఏపీలో ప్రాజెక్టుల పునరుద్ధరణకు రూ.778 కోట్లు

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న గుత్తా జ్వాల, విష్ణు విశాల్