Bigg Boss 4 : అందరు చూస్తుండగా అతడికి ఘాటుగా ముద్దిచ్చిన హారిక.. హౌస్‌‌‌‌లో ఉన్నవాళ్ళంతా షాక్

బిగ్ బాస్ సీజన్ 4 మొదట్లో షో చప్పగా సాగుతుందని విమర్శలు వచ్చాయి. కానీ  సీజన్ ముగింపు దశకు వచ్చే సరికి రసవత్తరంగా మారింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు.

Bigg Boss 4 : అందరు చూస్తుండగా అతడికి ఘాటుగా ముద్దిచ్చిన హారిక.. హౌస్‌‌‌‌లో ఉన్నవాళ్ళంతా షాక్
Follow us

|

Updated on: Dec 19, 2020 | 9:01 AM

బిగ్ బాస్ సీజన్ 4..మొదట్లో షో చప్పగా సాగుతుందని విమర్శలు వచ్చాయి. కానీ సీజన్ ముగింపు దశకు వచ్చేసరికి రసవత్తరంగా మారింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. అభిజీత్, హారిక, అఖిల్, సోహెల్, అరియానా లో ఒకరు విన్నర్ కానున్నారు. అయితే  ఈ సారి బిగ్ బాస్ లో మసాలా కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. గ్లామర్ షోలు, ముద్దులు, హగ్గులతో కంటెస్టెంట్స్ రెచ్చిపోతున్నారు. ఇక యూట్యూబ్ స్టార్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది దేత్తడి హారిక.  హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండీ ఈ అమ్మడు ఫుల్ జోష్ లో గేమ్ ఆడుతూ చివరివరకు వచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నిరూపించుకుంది. హౌస్ లో ఈ చిన్నది లవ్ ట్రాకులతోనూ బాగానే ఫెమస్ అయ్యిందనే చెప్పాలి.

హారిక హౌస్ లో ఉన్న వారందరితో కలసిమెలసి ఉంటుంది. టాస్క్ ల సమయంలో 100 శాతం ఎఫర్ట్ పెట్టి ఆడుతుంది. ఇక ఏకంగా 8 సార్లు కెప్టెన్ అయ్యి రికార్డ్ సృష్టించింది హారిక. హౌస్ లో అభిజీత్ తో లవ్ ట్రాక్ నడుపుతూ ఈ అమ్మడు హాట్ టాపిక్ గా మారింది. మోనాల్ కు దూరంగా ఉంటూ వస్తున్న అభిజీత్ కు హారిక దగ్గరైంది. అప్పటి నుంచి ఈ ఇద్దరు ఒకరికోసంఒకరు అన్నట్టుగా చట్టపట్టాలేసుకు తిరుగుతున్నారు. అయితే గత కొన్నివారాలుగా హారిక అఖిల్ తో క్లోజ్ గా ఉంటూ వస్తుంది. అతడికి హగ్గులు ముద్దులు పెడుతూ హడావిడి చేస్తుంది. అయితే తాజాగా హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరికీ టీషర్ట్ ఇచ్చి..   ఆ టీ షర్ట్ వేసుకున్న సభ్యుడిపై మిగిలిన వారు తమ అభిప్రాయాన్ని చెప్పాలని బిగ్ బాస్ సూచించాడు. అఖిల్ వేసుకున్న టీషర్ట్ పైన నీ సోల్ మేట్ త్వరలోనే నిన్ను కలుస్తుంది అని రాసి అఖిల్ వీపు పైన ఘాటుగా ముద్దిచ్చింది హారిక. దాంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. ఇదిలా ఉంటే అఖిల్ కు దగ్గరవ్వడంతో హారికాకు అభిజీత్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వస్తున్నట్టు తెలుస్తుంది. అఖిల్ తో క్లోజ్ గా ఉండటంతో హారికాకు అభిజీత్ ఫ్యాన్స్ మద్దతులేకుండా పోయిందని అంటున్నారు.