Big News Big Debate: మళ్లీ మొదలైన క్యాంపు రాజకీయాలు.. బెంగళూరు టు మనాలి.. జైపూర్‌ టూ కన్యాకుమారి.. క్యాంపుల్లో సందడే సందడి

|

Dec 03, 2021 | 9:09 PM

Big News Big Debate: తెలంగాణ స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో ఓటుకు నోటు దుమారం మొదలైంది. తమకు ఓటేస్తే రెండున్నర లక్షలు ఇస్తామని సంగారెడ్డి MLA జగ్గారెడ్డి..

Big News Big Debate: మళ్లీ మొదలైన క్యాంపు రాజకీయాలు.. బెంగళూరు టు మనాలి.. జైపూర్‌ టూ కన్యాకుమారి.. క్యాంపుల్లో సందడే సందడి
Big News Big Debate
Follow us on

Big News Big Debate: తెలంగాణ స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో ఓటుకు నోటు దుమారం మొదలైంది. తమకు ఓటేస్తే రెండున్నర లక్షలు ఇస్తామని సంగారెడ్డి MLA జగ్గారెడ్డి ప్రలోభాలకు గురిచేస్తున్నారంటోంది అధికార TRS పార్టీ. ఓటమి భయంతోనే ఫిర్యాదులు చేస్తున్నారంటూ ఎదురుదాడి చేస్తోంది కాంగ్రెస్‌. అటు కరీంనగర్‌ జిల్లాలోనూ క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. సునాయసంగా గెలుస్తామని భావించినా.. ప్రత్యర్థి పార్టీలన్నీ రెబల్‌కు మద్దతివ్వడంతో TRS వ్యూహం మారుస్తోంది. అటు ఖమ్మంలోనూ సొంతపార్టీ ఓటర్లు చేజారకుండా క్యాంపులనే నమ్ముకున్నాయి పార్టీలు. ఏకగ్రీవం అవుతాయని భావించినా.. సాధారణ ఎన్నికలను తలపిస్తోంది స్థానిక మండలి పోరు.

బలం లేకపోయినా ప్రత్యర్థి పార్టీలు బరిలో ఉండటంతో ఓట్లు క్రాస్‌ కాకుండా కాపాడుకోవడం అధికారపార్టీకి సవాలుగా మారింది. దీంతో మెదక్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన ఓటర్లను క్యాంపులకు తరలిస్తోంది TRS. కరీంనగర్‌లో భానుప్రసాద్‌, L‌.రమణలను బరిలో దింపింది అధికారపార్టీ. అయితే ముందు నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ రవీందర్‌ సింగ్‌ రెబల్‌గా పోటీలో దిగడం.. ఆయనకు BJP, ఇతర పార్టీలు మద్దతు ఉందన్న ప్రచారంతో టెన్షన్‌ మొదలైంది. దీంతో ఓటర్లను క్యాంపులకు తరలించిన TRS మంత్రులకు బాధ్యతలు అప్పగించింది.

తాజాగా సంగారెడ్డి కాంగ్రెస్ MLA జగ్గారెడ్డి ప్రలోభాలకు పాల్పడుతున్నారన్న TRS ఆరోపణలు రాజకీయాన్ని వేడెక్కించాయి. ఆయనపై ఎన్నికల సంఘానికే ఫిర్యాదు చేసింది అధికారపార్టీ. ప్రస్తుతం బెంగళూరు క్యాంప్‌లో ఉన్న ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన MPTCలు, ZPTCలు, కౌన్సిలర్లకు బంధువుల ద్వారా జగ్గారెడ్డి ప్రలోభ పెడుతున్నారనేది TRS ఆరోపణ. అడ్వాన్సుగా 50 వేలు, గెలిచిన తర్వాత రెండు లక్షలు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారని అధికారపార్టీ ఆరోపిస్తోంది.

తాము ఎవరినీ ప్రలోభ పెట్టలేదంటున్నారు కాంగ్రెస్‌ MLA జగ్గారెడ్డి. తనకు బయపడి TRS నేతలు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసారని కౌంటర్‌ ఇచ్చారు. MPTC, ZPTCలకు TRS గౌరవం ఇవ్వడంలేదని అందుకే కాంగ్రెస్‌కు ఓటేస్తారన్న భయం ఉందంటున్నారు జగ్గారెడ్డి. ఓటర్లకు ప్రలోభాలకు గురిచేస్తుందని తాము కాదని.. TRS నాయకులే అంటూ ఆధారాలు బయటపెట్టారు.

మొత్తం మీద గతంలో MLC స్థానాలు చాలా వరకు ఏకగ్రీవం చేసుకున్న అధికార TRS కొన్ని స్థానాల్లో పోటీ అనివార్యమైంది. ప్రత్యర్ధులకు బలం నామమాత్రంగానే ఉన్నా క్రాస్‌ ఓటింగ్‌ భయాలు వెంటాడుతున్నాయి.

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

PM Modi: డిజిటల్ విప్లవం కరెన్సీ చరిత్రను మార్చేసింది.. ఇన్ఫినిటీ ఫోరం ప్రారంభించిన ప్రధాని మోడీ

రోజుకు 300 మంది జంప్.. మాతృభూమిపై తగ్గుతోన్న మమకారం.. పౌరసత్వానికి చెల్లుచీటీ ఇస్తున్న లక్షలాది మంది భారతీయులు