వార ఫలాలు (మే 26 నుంచి జూన్ 1, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితుల బాగా మెరుగ్గా ఉంటాయి. వృషభ రాశి వారికి కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. మిథున రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ధన స్థానంలో ఉన్న గురు, శుక్ర, రవుల కారణంగా ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితుల బాగా మెరుగ్గా ఉంటాయి. పలుకుబడి బాగా పెరుగుతుంది. మొత్తం మీద వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. అనేక మార్గాలలో ఆదాయం లభించే అవకాశముంది. అనవసర ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం కొనసాగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం కుదుటపడు తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల విషయంలో ఆశించిన శుభవార్తలు అందుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఈ రాశిలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి శుక్రుడు గురు, రవులతో కలిసి ఉన్నందువల్ల, సర్వత్రా ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశం ఉంది. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. సహోద్యోగుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు చురుకుగా, సంతృప్తికరంగా పూర్త వుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కనీస లాభాలకు ఇబ్బంది ఉండదు. ఉద్యోగ జీవితంలో అధికారులు బాధ్యతలు పెంచుతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ధన కారకుడైన గురువు వ్యయ స్థానంలో శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు, కార్యక్రమాలు చేపట్టడానికి సమయం చాలావరకు అనుకూ లంగా ఉంది. లాభ స్థానంలో రాశ్యధిపతి బుధుడు ఉండడం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బం దేమీ ఉండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఆదాయం పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గే అవకాశం లేదనే చెప్పవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఉద్యో గాల్లో శుభ వార్తలు వినడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
లాభ స్థానంలో రెండు శుభ గ్రహాలు, దశమ స్థానంలో బుధుడు ఉన్నందువల్ల ఉద్యోగంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. సాధారణంగా ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల లాభం ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ పరిస్థితులఝతు కూడా చక్కబడతాయి. వ్యాపారంలో బలం పుంజుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక సహాయం విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయటా అనుకూలతలు కనిపిస్తాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ స్థానంలో శుక్ర, గురువుల సంచారం వల్ల ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోవడం, ఉద్యోగ సంబంధమైన ప్రతి ప్రయత్నమూ సఫలం కావడం జరుగుతుంది. అయితే, అధికారులు, సహోద్యోగులతో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపో తాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్త వుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మాటపట్టింపులు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామికి కొద్దిపాటి అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. రాదను కున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
షష్ట స్థానం శనితోనూ, భాగ్య స్థానం గురు, శుక్రులతోనూ బలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్య మైన సమస్యలు, వివాదాల నుంచి తప్పకుండా విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీతభత్యాలు పెరిగే అవకాశముంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సమాజంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో వ్యూహాలు మారుస్తారు. నిరుద్యోగులకు సమయం అన్ని విధాలు గానూ అను కూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల లాభం ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఆశించిన శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రాశ్యధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో బలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. మొత్తం మీద వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. ఇష్టమైన బంధువులను శుభ కార్యంలో కలుసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా వృద్ధి చెందు తాయి. కొత్త లక్ష్యాలు చేపడతారు. వ్యాపారాల్లో మార్పులు చేసి లాభాలు పొందుతారు. దైవ చింతన పెరుగుతుంది. పిల్లలు బాగా పురోగతి చెందుతారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
సప్తమ స్థానంలో గురు, రవి, శుక్రుల యుతి కారణంగా ఎటువంటి ప్రయత్నమైనా సానుకూలంగా నెరవేరుతుంది. జనాకర్షణ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని పురోగతి ఉంటుంది. వ్యక్తి గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడ తాయి. కుటుంబసమేతంగా శుభ కార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్న నాటి మిత్రులతో కాలక్షేపం చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు వేగంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపడతారు. ప్రేమలో పడే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
తృతీయంలో శని, పంచమ స్థానంలో బుధుడు అనుకూలంగా ఉన్నప్పటికీ రాశ్యధిపతి గురువు షష్ట స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక లావాదేవీలు చిక్కులకు దారితీస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోయే అవకాశం ఉంది. ఆదాయం పెరిగినా ఖర్చులతో ఇబ్బందులు పడతారు. ఇతర గ్రహాల బలం వల్ల ఎటువంటి ప్రయ త్నమైనా సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితా లనిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి, అభివృద్ధి బాటపడతాయి. ఉద్యోగ జీవి తం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఈ రాశివారికి ప్రధాన గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. గృహ, వాహన యోగాలకు అవకాశ ముంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ సజావుగా పూర్తవు తాయి. అనుకున్న సమయానికి ముఖ్యమైన పనులు చాలావరకు పూర్తి అవుతాయి. తల్లి తండ్రులు లేదా పిల్లలు ఇంటికి వచ్చే అవకాశముంది. పిల్లలు చదువులు, పరీక్షల్లో ఘన విజ యాలు సాధిస్తారు. ఉద్యోగ జీవితంలో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ అనుకూలంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. రావలసిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ధన స్థానంలో కుజుడు, చతుర్థ స్థానంలో గురు, శుక్రుల కారణంగా వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆదాయం బాగా కలిసి వస్తుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. రుణ సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలకు కూడా ఆశించిన స్పందన లభిస్తుంది. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే సూచనలున్నాయి. ఇతరుల విషయాల్లో కల్పించుకోవద్దు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్యం పరవాలేదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొంత వరకు ఊరట లభిస్తుంది. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
కుజ, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం వంటివి పెట్టుకోవద్దు. పెండింగ్ పనుల న్నిటినీ చాలావరకు పూర్తి చేస్తారు. కొందరు మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కొందరు బంధువులకు అండగా నిలబడతారు. మధ్య వర్తిత్వం నిర్వహించి విభేదాలు పరిష్కరిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించడం మంచిది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి.