Money Astrology: శుక్ర బలంతో ఆ రాశుల వారికి ఇక డబ్బే డబ్బు! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

Shukra Gochar in Kanya Rasi: ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 2 వరకు శుక్రుడు కన్యా రాశిలో సంచరించనున్నాడు. శని, కుజుల శుభ దృష్టి కారణంగా శుక్రుడికి బలం పెరగడంతో వృషభం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి ప్రేమ, వివాహం, దాంపత్యం, ఆర్థికం, కోరికల నెరవేర్పులో అనుకూల ఫలితాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Money Astrology: శుక్ర బలంతో ఆ రాశుల వారికి ఇక డబ్బే డబ్బు! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Shukra Blessings

Edited By:

Updated on: Aug 04, 2026 | 1:38 PM

ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 2 వరకు శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ శుక్రుడిని మిథున రాశి నుంచి కుజుడు, మీన రాశి నుంచి శనీశ్వరుడు వీక్షించడం వల్ల కొన్ని రాశులకు శుభ యోగాలు కలిగే అవకాశం ఉంది. శుక్రుడికి కన్యా రాశి నీచ స్థానమే అయినప్పటికీ ఇది మిత్ర క్షేత్రం కూడా అయింది. ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారం, దాంపత్య జీవితం, విలాస జీవితం, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడికి బలం పెరిగినందువల్ల వృషభం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి మనసులోని కోరికలు తీరే అవకాశం ఉంది. నీచత్వంతో బలహీనపడాల్సిన శుక్రుడికి శని, కుజుల దృష్టి కారణంగా బలం బాగా పెరిగింది.

  1. వృషభం: పంచమ స్థానంలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడిని శని, కుజులు వీక్షించడం వల్ల ఈ రాశివారు కొన్ని కష్టనష్టాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో పాటు ఇంటి సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. సగటు వ్యక్తి సైతం కొద్ది ప్రయత్నంతో సంపన్ను డయ్యే అవకాశం ఉంది. ప్రేమ, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. గృహ, వాహన యోగాలు పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. తక్కువ శ్రమతో ఆదాయం వృద్ధి చెందుతుంది.
  2. సింహం: ధన, కుటుంబ స్థానంలో శుక్రుడికి శని, కుజుల వీక్షణతో బలం పెరిగినందువల్ల కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కా రమవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు రెట్టింపవుతాయి. దాంపత్య జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఎటువంటి ప్రయ త్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. షేర్ల సహా అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.
  3. కన్య: ఈ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడిని సప్తమ స్థానం నుంచి శనీశ్వరుడు, దశమ స్థానం నుంచి కుజుడు వీక్షించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. తమ తమ రంగాల్లో అందలాలు ఎక్కడం జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబం ధం కుదరడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పడతాయి.
  4. వృశ్చికం: లాభ స్థానంలో ఉన్న శుక్రుడిని శని, కుజులు వీక్షించడం వల్ల ఈ రాశివారికి సుఖ సంతోషాలు, మనశ్శాంతి వృద్ధి చెందుతాయి. రాజయోగాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగు తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాథాన్యం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభి స్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో శుక్రుడిని శని, కుజులు వీక్షించడం వల్ల రాజపూజ్యాలు కలుగు తాయి. ఉద్యోగంలో అధికారయోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. నిరు ద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం తప్పకుండా జరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
  7. మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న శుక్రుడిని రాశ్యధిపతి శనితో పాటు లాభాధిపతి కుజుడు కూడా వీక్షించడం వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ప్రాధాన్యం, ప్రాభవం కూడా బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది.
Loading...
Unable to load recommendations.
Follow Us