AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో ఈ మొక్కలు అస్సలు పెట్టకండి.. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు వస్తాయట!

Plants to Avoid at Home Telugu: వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు, చిత్రాలు ఉంచడం మంచిది కాదని చెబుతారు. ముఖ్యంగా కాక్టస్, ముళ్ల మొక్కలు, చింతచెట్టు, బొప్పాయి చెట్టు విషయంలో వాస్తు నిపుణులు చెప్పే విషయాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Vastu Tips: ఇంట్లో ఈ మొక్కలు అస్సలు పెట్టకండి.. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు వస్తాయట!
Plants To Avoid At Home Telugu
Rajashekher G
|

Updated on: Sep 11, 2026 | 12:04 PM

Share

Vastu Tips: Avoid These Plants at Home Telugu: వాస్తుశాస్త్రంలో ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లో ఉంచే వస్తువులు, మొక్కలు, చిత్రాల విషయంలోనూ కొన్ని సూచనలు ఉన్నాయి. ఇంట్లో కొన్ని మొక్కలు, కొన్ని రకాల చిత్రాలను ఉంచడం వల్ల ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని వాస్తు విశ్వాసాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కొన్ని మొక్కలు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతారు. మరి వాస్తు ప్రకారం ఇంట్లో ఎలాంటి మొక్కలు ఉండకూడదు? తెలుసుకుందాం.

ఇంట్లో కాక్టస్ మొక్క వద్దంటారు

వాస్తు ప్రకారం ఇంట్లో కాక్టస్ లేదా ఇతర ముళ్ల మొక్కలను పెంచకూడదని చెబుతారు. ముళ్లు ఉండే మొక్కలు ఇంట్లో ప్రతికూలతకు కారణమవుతాయని వాస్తు విశ్వాసం. వీటివల్ల కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు, భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉందని చెబుతారు.

ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చింతచెట్టు ఉండకూడదట

వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా చింతచెట్టు ఉండకూడదని అంటారు. ఇలా ఉండటం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడి, కుటుంబంలో తరచూ వివాదాలు చోటుచేసుకోవచ్చని నమ్మకం. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నట్లు చెబుతారు.

ఇవి కూడా చదవండి

ఇంటి ముందు లేదా వెనుక బొప్పాయి చెట్టు?

వాస్తు విశ్వాసాల ప్రకారం ఇంటికి పూర్తిగా ఎదురుగా లేదా ఇంటి వెనుక భాగంలో బొప్పాయి చెట్టు ఉండకూడదని కొందరు నిపుణులు సూచిస్తారు. ఇలా ఉండటం వల్ల ఇంట్లో ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వాస్తు నమ్మకాలు చెబుతున్నాయి.

ముళ్ల మొక్కలకు దూరంగా ఉండాలి

వాస్తు ప్రకారం ఎలాంటి ముళ్ల మొక్కలను ఇంటి ప్రాంగణంలో పెంచకపోవడం మంచిదని చెబుతారు. ముఖ్యంగా గుచ్చుకునే ముళ్లు ఉన్న మొక్కలు కుటుంబంలో అనవసరమైన ఉద్రిక్తతలు, గొడవలకు కారణమవుతాయని నమ్మకం.

యుద్ధ దృశ్యాల చిత్రాలు కూడా వద్దట

మొక్కలతో పాటు ఇంట్లో పెట్టే చిత్రాల విషయంలోనూ వాస్తు కొన్ని సూచనలు చేస్తుంది. యుద్ధాలు, హింస, కలహాలకు సంబంధించిన దృశ్యాలు ఉన్న చిత్రాలను ఇంట్లో అలంకరణగా ఉంచకూడదని వాస్తు విశ్వాసాలు చెబుతున్నాయి. ఇలాంటి చిత్రాలు ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని పెంచుతాయని నమ్ముతారు.

(Disclaimer: ఈ కథనంలో వాస్తుశాస్త్రంలో ఉన్న సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన విషయాలే. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని భావించకూడదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us