Friendship Astrology: వారికి మామూలు స్నేహితులు ప్రాణ స్నేహితులుగా మారుతారు.. మీ రాశికి స్నేహ బంధం ఇలా..

జాతక చక్రంలో లాభ స్థానం స్నేహ బంధాలను సూచిస్తుంది. జీవితంలో స్నేహాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. లాభ స్థానంలో ఏదో ఒక గ్రహం ఉండడం మంచిదని జ్యోతిషశాస్త్రవేత్తలు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఆ స్థానంలో శుభ గ్రహం ఉన్నా, పాప గ్రహం ఉన్నా శుభ ఫలితాలనే ఇస్తుంది. విచిత్రంగా ఈ స్థానం ఆదాయాన్ని, పురోగతిని, సోషల్ లైఫ్ ని కూడా సూచిస్తుంది. ప్రస్తుతం గ్రహచారంలో..

Friendship Astrology: వారికి మామూలు స్నేహితులు ప్రాణ స్నేహితులుగా మారుతారు.. మీ రాశికి స్నేహ బంధం ఇలా..
Friendship Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 22, 2023 | 7:35 PM

జాతక చక్రంలో లాభ స్థానం స్నేహ బంధాలను సూచిస్తుంది. జీవితంలో స్నేహాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. లాభ స్థానంలో ఏదో ఒక గ్రహం ఉండడం మంచిదని జ్యోతిషశాస్త్రవేత్తలు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఆ స్థానంలో శుభ గ్రహం ఉన్నా, పాప గ్రహం ఉన్నా శుభ ఫలితాలనే ఇస్తుంది. విచిత్రంగా ఈ స్థానం ఆదాయాన్ని, పురోగతిని, సోషల్ లైఫ్ ని కూడా సూచిస్తుంది. ప్రస్తుతం గ్రహచారంలో అయిదు రాశుల వారికి లాభ స్థానం అంటే, పదకొండవ స్థానం బలంగా ఉన్నందువల్ల ఈ రాశివారికి మైత్రీ బంధాలు దృఢం కావడం, కొత్త పరిచయాలు ఏర్పడడం, స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభించడం వంటివి జరుగుతాయి. ఇక రెండు రోజులకు ఒకసారి రాశి మారే చంద్రుడు ఎవరి లాభ స్థానంలోకి ప్రవేశించినా, స్నేహ బంధం సానుకూలంగా మారుతుంటుంది. ఇంతకూ ఆ ఆయిదు రాశులుః మేషం, వృషభం, మిథునం, వృశ్చికం, మకరం.

  1. మేషం: ఈ రాశివారికి లాభ స్థానంలో లాభాధిపతి శనీశ్వరుడే ఉండడం వల్ల శక్తిమంతులైన, పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అందులోనూ శనీశ్వరుడు రాజకీయాలతో సంబంధం ఉన్న గ్రహం అయినందువల్ల రాజకీయ ప్రముఖులతో లేదా ప్రజా నాయకులతో స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. రోజూ ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడడం కూడా జరుగుతుంది. సాధారణంగా మామూలు పరిచయాలు సైతం ప్రాణ స్నేహాలుగా మారే అవకాశం ఉంటుంది. ఎలాంటి సహాయం చేయడానికైనా ముందుండే విధేయ స్నేహితులు ఏర్పడడం జరుగుతుంది.
  2. వృషభం: ఈ రాశివారికి లాభ స్థానంలో రాహువు సంచరిస్తుండడం వల్ల సంపన్న కుటుంబాలకు చెందిన వారు, ఉన్నతాధికారులు, ప్రజానాయకులు స్నేహితులయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్నేహితు లతో విడదీయ రాని బంధం ఏర్పడుతుంది. సాధారణంగా ఈ రాశివారికి చిన్ననాటి స్నేహితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి ఈ పదకొండవ స్థానంలో రాహువు ప్రవేశించినప్పటి నుంచి వివిధ రంగాలకు చెందినవారు పరిచయం కావడం, వారి వల్ల జీవితం అనేక రకాలుగా మలుపులు తిరగడం జరుగుతుంది. కొన్ని అనవసర పరిచయాలకు కూడా అవకాశం ఉంది.
  3. మిథునం: ఈ రాశివారికి లాభస్థానంలో గురు సంచారం వల్ల తప్పకుండా ఉన్నత స్థాయి వ్యక్తులతో మాత్రమే పరిచయాలు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వివిధ రంగాలకు చెందిన ఉన్నతాధికారులు, నిపు ణులు, మేధావులు, ప్రతిభావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ స్నేహితుల వల్ల సమా జంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు, ఆదాయం వృద్ధి చెందడం, పురోగతి చెందడం, వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. అంతేకాక, మిత్రులలో కూడా కొందరు ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు తప్పకుండా ప్రముఖులుగా చెలామణీ అవడం జరుగుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశివారికి లాభ స్థానంలో శుక్ర, కేతువులు ఉండడం వల్ల పురుషులకు స్త్రీలతో, స్త్రీలకు పురుషులతో స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది. చిత్ర విచిత్రమైన స్నేహాలు ఏర్పడడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని అనవసర పరిచయాలతో పాటు ఆధ్యాత్మిక సంబంధమైన పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. స్నేహితుల కారణంగా విలాస జీవితం అలవాట వుతుంది. మామూలు స్నేహాలు ప్రాణ స్నేహాలుగా మారడం జరుగుతుంది. స్నేహితుల సంఖ్య బాగా పెరగడం, వీరి వల్ల సహాయ సహకారాలు పెంపొందడం వంటివి జరిగే సూచనలున్నాయి.
  5. మకరం: ఈ రాశివారికి లాభ స్థానంలో కుజ, రవి, బుధ గ్రహాలు సంచారం చేస్తున్నందువల్ల సాధారణంగా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, మేధావులు, కళారంగాలకు చెందిన వారితో లాభదాయకమైన లేదా ఉపయోగకరమైన స్నేహ సంబంధాలు పెంపొందే అవకాశం ఉంటుంది. తమ సంస్థకు చెందిన అధికారులతో కూడా సాన్నిహిత్యం పెరిగే సూచనలున్నాయి. ఇందులో కుజుడికి ఈ లాభ స్థానం స్వస్థానం అయినందువల్ల ఈ స్నేహాల వల్ల గౌరవమర్యాదలు, పలుకుబడి పెరగడం జరుగుతుంది.

బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?