
జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ ధనాధిపతి (ద్వితీయ స్థానాధిపతి) బలంగా లేదా అనుకూలంగా ఉండే పక్షంలో అటువంటి రాశులవారి ఆర్థిక పరిస్థితికి తిరుగుండదు. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లకు అవకాశం ఉండదు. ధనాధిపతి అనుకూలంగా ఉన్నవారికి శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత గోచారం ప్రకారం వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశులకు ధనాధిపతి బాగా అను కూలంగా ఉన్నందువల్ల వీరికి ఆదాయం క్రమంగా పెరగడం, ఆర్థిక సమస్యలు తగ్గడం తప్పకుండా జరుగుతుంది.
ఈ రాశికి ధనాధిపతి అయిన బుధుడు మరో నాలుగు నెలల పాటు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల, ఈ రాశివారికి ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. అంచనాలకు మించిన ఆర్థిక లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
ఈ రాశివారికి ధన స్థానాధిపతి అయిన చంద్రుడు అనుకూలంగా ఉండడంతో పాటు, ధన స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఈ రాశివారికి ఆదాయానికి ఢోకా ఉండకపోవచ్చు. కొద్ది ప్రయత్నంతో వీరికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాదంతా వీరికి షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. అపారమైన ధన లాభం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వీరికి ఇక ఆర్థిక సమస్యలు ఉండే అవకాశం లేదు.
ఈ రాశివారికి ధనాధిపతి అయిన రవి మరో రెండు నెలల పాటు బాగా అనుకూలంగా ఉండబో తున్నందువల్ల ఈ రాశివారి ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. ఆర్థికపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందడంతో పాటు బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. షేర్ల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ఒక ప్రణా ళిక ప్రకారం ఆదాయాన్ని మదుపు చేసి ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంది.
ఈ రాశికి ధన, భాగ్యాధిపతి అయిన శుక్రుడు మరో రెండు నెలల పాటు అనుకూలంగా ఉన్నం దువల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతమవుతుంది. తేలిక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. వ్యాపారాల్లో అంచనాల్ని మించి ధనలాభం కలుగుతుంది. ఆస్తిపాస్తుల ద్వారా సంపద పెరుగుతుంది. ఈ నెలలో ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
ఈ రాశివారికి ధనాధిపతి అయిన కుజుడు భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల అతి త్వరలో ఈ రాశివారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యు లేషన్లు అపారంగా లాభిస్తాయి. రావలసిన సొమ్ముపూర్తిగా చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల వల్ల లాభాలు కలుగుతాయి. ఆదాయం దిన దినాభివృద్ది చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యానే కాక ప్రభుత్వపరంగా కూడా ధన ప్రాప్తికి అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో సంపన్నులు అవుతారు.
ఈ రాశివారికి ధనాధిపతి శని తృతీయ స్థానంలోకి మారడం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. బుధ, శుక్రులు కూడా అనుకూలం కావడం వల్ల వివిధ మార్గాల్లో అపార ధన లాభం కలుగుతుంది. జీతభత్యాలు, అదనపు ఆదాయం, లాభాలు పెరగడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల, ఆస్తిపాస్తుల వల్ల బాగా లాభాలు కలిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి దక్కుతుంది. అక్టోబర్ లోగా ఈ రాశివారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.