Zodiac Signs: స్వతంత్ర జీవనంతో వీరు ఉన్నత స్థాయికి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ఆరు రాశుల వారికి స్వతంత్రంగా జీవించేందుకు, సొంతంగా ఎదిగేందుకు గ్రహాల అనుకూలత కలిసివచ్చే అవకాశం ఉంది. మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారు గురు, కుజ, రవుల అనుకూల ప్రభావంతో ఉద్యోగానికి బదులుగా సొంతంగా ఏదైనా చేయాలనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 31లోగా పట్టుదలతో ముందడుగు వేస్తే స్వతంత్ర జీవనంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉందని జ్యోతిష్య నమ్మకం.

ఎవరి మీదా ఆధారపడకుండా, ఎక్కడా ఎవరి దగ్గరా ఉద్యోగం చేయకుండా స్వతంత్రంగా విజయవంతంగా జీవించడమనేది ఒక గొప్ప అదృష్టం. ఇటువంటి అదృష్టం పట్టడానికి ఆరు రాశులవారికి అవకాశం ఉంది. స్వత్రంత జీవనం విషయంలో వీరు అక్టోబర్ 31లోగా గట్టి నిర్ణయం తీసుకోవ డానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. పట్టుదల, దైర్య సాహసాలు, తెగువ బాగా ఎక్కువగా ఉండే మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశులవారు గురు, కుజ, రవుల అనుకూలత వల్ల స్వతంత్ర జీవనం గడపడానికి బాగా అవకాశం ఉంది. వీరు తలచుకుంటే వీరి మనసులోని కోరిక తీరడం, స్వతంత్ర జీవనంతో ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది.
మేషం
ఈ రాశివారు ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని అంత త్వరగా మార్చుకోరు. వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దృఢ నిర్ణయాలు తీసుకుని వాటికి పూర్తిగా కట్టుబడి ఉంటారు. స్వతంత్రంగా జీవించాలని, సొంత వ్యాపారం, స్వయం ఉపాధిని చేపట్టాలన్న వీరి చిరకాల కోరిక ఉచ్ఛ స్థిత గురువు ద్వారా నెరవేరే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, ఆర్థిక లావాదేవీల వంటివి వీరికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.
సింహం
ఈ రాశివారిలో స్వతంత్ర జీవనం సాగించాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఏదో ఒక దశలో వీరు ఉద్యోగానికి స్వస్తి చేప్పి స్వతంత్ర జీవనం ప్రారంభించే అవకాశం ఉంది. అందుకు ఇప్పుడు సమయం బాగా అనుకూలంగా ఉంది. నాయకత్వం, వ్యూహ రచన, పథకాలు వీరి సహజ లక్షణాలు. గురు, రవి, కుజుల బలం వల్ల వీరికి స్వతంత్ర జీవనం బాగా కలిసి వస్తుంది. వైద్యం, ఆరోగ్యం, రియల్ ఎస్టేట్, కన్సల్టెన్సీ, డీలర్షిప్, కౌన్సెలింగ్, షేర్ల వ్యాపారం బాగా లాభిస్తాయి.
తుల
సహజ వ్యాపార లక్షణాలు కలిగిన ఈ రాశివారు ఎక్కువగా స్వతంత్ర జీవనం, స్వయం ఉపాధి వంటి వాటికే ప్రాధాన్యమిస్తుంటారు. సహజసిద్ధంగా వ్యాపార దక్షత కలిగిన వీరికి ఇతరుల కింద పనిచేయడం ఇష్టం ఉండదు. వీరు తమ నైపుణ్యాలు, అనుభవాలకు తగ్గ వ్యాపారం ప్రారంభిం చడం వల్ల రాణించే అవకాశం ఉంది. ట్రావెలింగ్, మార్కెటింగ్, టెక్నాలజీ, శిక్షణ కేంద్రాల వంటివి బాగా లాభిస్తాయి. దశమ స్థానంలో ఉన్న గురువు వల్ల వీరు తప్పకుండా సక్సెస్ కావడం జరుగుతుంది.
వృశ్చికం
రాశ్యధిపతి కుజుడు పట్టుదలకు, చొరవకు, తెగువకు కారకుడైనందువల్ల సాధారణంగా ఈ రాశి వారు స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తుంటారు. వీరిలో గోప్యత కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వీరు ఇత రుల మీద ఆధారపడడం కూడా చాలా తక్కువ. భాగ్య స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉన్న గురువుతో పాటు కుజుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల రియల్ ఎస్టేట్, లిక్కర్, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, బ్రోకరేజ్ వంటి వాటి ద్వారా లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంది.
ధనుస్సు
అతి వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో, సునిశిత పరిశీలనలో, సొంత ఆలోచనల్లో దిట్టలైన ఈ రాశివారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరి లక్ష్యాలు, ఆశయాలు, ఆశలు ఇతరు లకు భిన్నంగా ఉంటాయి. రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితికి రావడంతో పాటు కుజ, రవుల అను కూలత వల్ల తమకు నైపుణ్యం ఉన్న రంగంలో స్వతంత్ర జీవనం చేపట్టడానికి అవకాశం ఉంది. వ్యవసాయం, మార్కెటింగ్, సినిమా, టీవీ, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో బాగా రాణించడం జరుగుతుంది.
మకరం
ఈ రాశివారిలో ఆత్మ విశ్వాసం, ఆత్మాభిమానం ఓ పాలు ఎక్కువగా ఉంటాయి. తమ శక్తి సామ ర్థ్యాల మీద వీరికి నమ్మకం ఎక్కువ. తమ బాధ్యతల్ని ఎవరికీ అప్పగించరు. స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. స్వయం కృషికి ప్రాధాన్యమిస్తారు. గురువు సప్తమ స్థానంలో ఉచ్ఛపట్టడంతో పాటు, కుజ, రవుల బలం కూడా కొనసాగడం వల్ల వైద్యం, ఆరోగ్యం, లా, కన్సల్టెన్సీ, ట్రావెలింగ్, కౌన్సెలింగ్, షేర్లు, వడ్డీ వ్యాపారాల్లో వీరు అంచనాలకు మించి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.



