AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Zodiac Signs: విశేష వృద్ధి యోగం.. ఆ రాశుల వారికి విజయాలే విజయాలు!

Success Astrology 2025: జ్యోతిష శాస్త్రంలో 3, 6, 10, 11 స్థానాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ స్థానాలను ఉపచయ స్థానాలుగా పరిగణించడం జరుగుతోంది. ఉపచయ స్థానాలంటే వృద్ధి స్థానాలని జ్యోతిష్య శాస్త్రంలో పరిగణిస్తారు. వీటిని బట్టి జాతకుడు ఏ స్థాయిలో, ఏ విధంగా జీవితంలో అభివృద్ధి చెందేదీ అర్థం చేసుకోవచ్చు. జాతక చక్రంలోనే కాకుండా గ్రహ సంచారంలో కూడా ఈ స్థానాలకు అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది. ఈ నాలుగు స్థానాల్లోని గ్రహాలను బట్టి అభివృద్ధిని అంచనా వేయాల్సి ఉంటుంది.

Success Zodiac Signs: విశేష వృద్ధి యోగం.. ఆ రాశుల వారికి విజయాలే విజయాలు!
Success Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 08, 2025 | 5:35 PM

Share

జ్యోతిష శాస్త్రంలో 3, 6, 10, 11 స్థానాలను ఉపచయ స్థానాలుగా పరిగణించడం జరుగుతోంది. ఉపచయ స్థానాలంటే వృద్ధి స్థానాలని అర్థం. వీటిని బట్టి జాతకుడు ఏ స్థాయిలో, ఏ విధంగా జీవితంలో అభివృద్ధి చెందేదీ అర్థం చేసుకోవచ్చు. జాతక చక్రంలోనే కాకుండా గ్రహ సంచారంలో కూడా ఈ స్థానాలకు అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది. ఈ నాలుగు స్థానాల్లోని గ్రహాలను బట్టి అభివృద్ధిని అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ నాలుగు స్థానాలలోనూ గ్రహాలున్న పక్షంలో విశేషమైన అభివృద్ది సాధ్యమవుతుంది. ఒకే ఒక గ్రహం ఉంటే అభివృద్ధి లేదా వృద్ధి సామాన్యంగా ఉంటుంది. మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, మకరం, మీన రాశులకు మరో మూడు నెలల పాటు విశేషమైన వృద్ధి యోగం పట్టడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశివారికి మూడవ స్థానంలో రాశ్యధిపతి కుజుడు, ఆరవ స్థానంలో కేతువు, పదవ స్థానంలో రవి, బుధులు, 11వ స్థానంలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా విశేషమైన పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు చేపట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. అనేక మార్గాలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి.
  2. వృషభం: ఈ రాశివారికి 10వ స్థానంలో శని, 11వ స్థానంలో ఉచ్ఛ శుక్రుడి సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి ఆర్థిక లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక, అధికార యోగాలు కలుగుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభాలనిస్తాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందడం జరుగుతుంది.
  3. సింహం: ఈ రాశికి 6వ స్థానంలో రవి, బుధులు, దశమంలో గురువు, లాభస్థానంలో కుజు సంచారం వల్ల ఏ రంగంలో ఉన్నవారికైనా ఊహించని పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. భూ లాభం కలుగుతుంది. ఆదాయం విశేషంగా అభివృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి.
  4. కన్య: ఈ రాశివారికి 6వ స్థానంలో శనీశ్వరుడు, 10వ స్థానంలో కుజ సంచారం వల్ల ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. కొన్ని ఆర్థిక, వ్యక్తిగత సమస్యల విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఊహించని విధంగా ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. మనస్సులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. కొన్ని ఆస్తి వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి.
  5. ధనుస్సు: ఈ రాశివారికి 3వ స్థానంలో శని, ఆరవ స్థానంలో రాశ్యధిపతి గురువు, దశమంలో కేతు సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో స్తబ్ధత తొలగిపోయి, యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. జీవనశైలి మారిపోతుంది. ఈ రాశివారికి ఏదో విధమైన పురోగతి కలుగుతూనే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
  6. మకరం: ఈ రాశివారికి మూడవ స్థానంలో శుక్ర, రాహువులు, ఆరవ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం కూడా మెరుగైన స్థితిలో ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగపరంగా అనేక అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులకు ఊహించని విధంగా మంచి ఉద్యోగ యోగం పడు తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు.
  7. మీనం: ఈ రాశివారికి 3వ స్థానంలో రాశ్యధిపతి గురువు, లాభ స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల అదనపు ఆదాయ మార్గాలు ఊహించని ఆర్థిక యోగాలు కలిగిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అత్యధికంగా లాభాలు కలుగుతాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అయిపోవడం జరుగు తుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి.

Follow Us
ఎన్టీఆర్ కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు
ఎన్టీఆర్ కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు
బుధుడి అనుగ్రహం.. వీరికి భారీ లాభాలు.. ఒక్క దెబ్బకు లైఫ్ సెట్టు..
బుధుడి అనుగ్రహం.. వీరికి భారీ లాభాలు.. ఒక్క దెబ్బకు లైఫ్ సెట్టు..
బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను
బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను
వీడు మహా కంత్రీ.. దోచుకున్న బంగారాన్ని ఎలా అమ్ముతాడంటే..!
వీడు మహా కంత్రీ.. దోచుకున్న బంగారాన్ని ఎలా అమ్ముతాడంటే..!
వైట్ వర్సెస్ బ్రౌన్ ఎగ్‌.. దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి..
వైట్ వర్సెస్ బ్రౌన్ ఎగ్‌.. దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి..
కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్.. 25 ఏళ్ల తర్వాత ఆ ఇంట మళ్లీ సందడి!
కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్.. 25 ఏళ్ల తర్వాత ఆ ఇంట మళ్లీ సందడి!
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..