Shani Purnima 2026: శని దోష నివారణకు ఆ రాశులకు మరో అవకాశం..! ఈ పరిహారాలు చేయండి..

శని దోషం, శని దశ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సెప్టెంబర్ 26న వచ్చే శని పూర్ణిమ సందర్భంగా కొన్ని పరిహారాలు చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు శనికి దీపం వెలిగించడం, ప్రదక్షిణలు చేయడం, శివార్చన చేయించడం వంటి పరిహారాలు చేయడం ద్వారా ప్రతికూల ప్రభావాలు తగ్గి మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Shani Purnima 2026: శని దోష నివారణకు ఆ రాశులకు మరో అవకాశం..! ఈ పరిహారాలు చేయండి..
Shani Purnima 2026

Edited By:

Updated on: Sep 26, 2026 | 12:29 PM

గ్రహ సంచారంలో శని దోషాన్ని అనుభవిస్తున్నవారికి, జాతక చక్రంలో శని స్థితిగతుల వల్ల, శని దశ వల్ల కష్టనష్టాలు పడుతున్నవారికి పరిహారంగా మరొక అవకాశం ముందుకు వచ్చింది. ఈ నెల 26న వచ్చే శని పూర్ణిమ రోజున శనికి కొద్దిపాటి పరిహారం చేసుకునే పక్షంలో కొన్ని ఇబ్బం దులు, సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులవారు ఈ శని పూర్ణిమ రోజున శనికి దీపం వెలిగించడం, ప్రదక్షిణ చేయడం, శివార్చన చేయించడం వల్ల జీవితం కొద్దిగా సుఖ సంతోషాలతో సాగడానికి మార్గం సుగమమవుతుంది. సందర్భం వచ్చినప్పుడల్లా శనికి పరిహారం చేయించడం మంచిది.

మేషం

ఈ రాశికి వ్యయ స్థానంలో సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కలిగింది. దీనివల్ల ప్రతి ప్రయ త్నంలోనూ, ప్రతి వ్యవహారంలోనూ అపజయాలు, ఆలస్యాలు, వైఫల్యాలు ఎక్కువగా ఉండే అవ కాశం ఉంటుంది. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడల్లా వీరు శనిని ప్రసన్నం చేసుకునేందుకు పరిహారం చేయడం మంచిది. ఆదాయం వృద్ధి చెందడంతో పాటు కెరీర్ పరంగా ఉన్నత స్థితికి బాగా అవకాశం కలుగుతుంది.

సింహం

ఈ రాశికి అష్టమ స్థాన సంచారం వల్ల ఈ రాశివారు అష్టమ శని ఫలితాలను అనుభవించాల్సి వస్తోంది. ఊహించని కష్టనష్టాలు కలుగుతాయి. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రయత్నాల్లో ఎక్కువ భాగం విఫలం కావడం, నిరాశ కలిగించడం జరుగుతుంది. ఆదాయ వృద్ధి ఆగిపోవడంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఈ రాశివారు శని పూర్ణిమ నాడు శనికి 19 ప్రదక్షి ణలు చేయడం వల్ల పెళ్లి, ఉద్యోగం, ఆర్థిక ప్రయత్నాల్లో విజయాలు, సాఫల్యాలు లభించే అవకాశంఉంది.

ఇవి కూడా చదవండి

కన్య

ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం చేయడం వల్ల సాధారణంగా ఏ ప్రయత్నమూ కలిసి రాదు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగి, విశ్రాంతి కరువవుతుంది. వీరి పనితీరు పట్ల అధికారులు సంతృప్తి చెందరు. కొన్ని ముఖ్యమైన అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో వైఫల్యాలు కలుగుతాయి. వీటన్నిటి నుంచి బయటపడాలన్న పక్షంలో ఈ నెల 26న శనికి తైలాభిషేకం చేయడంతో పాటు, శివార్చన కూడా చేయడం చాలా మంచిది.

ధనుస్సు

ఈ రాశికి చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం కలిగింది. దీనివల్ల కుటుం బంలో సుఖ సంతోషాలు లోపించడం, కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యాలతో బాధపడడం, ఆస్తి వివాదాలు తలెత్తడం, ఇళ్లు మారడం, ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం, ఉద్యోగంలో పదోన్నతులు ఆగిపోవడం, వృత్తి, వ్యాపారాలు మందగించడం వంటివి జరుగుతాయి. వీటి నుంచి విముక్తికి తప్పనిసరిగా 26న శనికి దీపం వెలిగించడం, శివార్చన చేయించడం చాలా మంచిది.

కుంభం

ఈ రాశికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి దోషం కలిగింది. దీనివల్ల ఎంత శ్రమపడ్డా, ఎంతటి ప్రతిభ ఉన్నా ఎదుగుదల లేకపోవడం, వృత్తి, వ్యాపారాలు బాగా మందగించడం, ఆదాయం వృద్ది చెందకపోవడం, కుటుంబంలో సమస్యలు తలెత్తడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. శత్రు, రోగ, రుణ బాధలు పెరుగుతాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడ డానికి ఈ రాశివారు 26న శనికి దీపం వెలిగించడం, 19 ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది.

మీనం

ఈ రాశిలో శని సంచారం వల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని దోషం ఏర్పడింది. దీనివల్ల సమా జంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. అవమానాలు, వృథా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యాలకు అవకాశం ఉండదు. ఎదుగుదల ఉండదు. జీతభత్యాలకు మించి ఖర్చులు పెరుగుతాయి. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. వీటి నుంచి కొద్దిగానైనా బయటపడా లన్న పక్షంలో తప్పనిసరిగా శనికి తైలాభిషేకం, ప్రదక్షిణలు శివార్చన చేయించడం మంచిది.

Also Read: పౌర్ణమితో వీరికి అదృష్టం..! ఉద్యోగం, డబ్బు విషయంలో కొత్త అవకాశాలు

Loading...
Unable to load recommendations.
Follow Us