Lord Shani Dev: శనిదేవుడి అనుగ్రహం.. ఈ రాశులకు కెరీర్, ఆర్థికంగా కలిసొచ్చే కాలం!

Saturn Blessings: ఆగస్టు 20న శని రేవతి నక్షత్రంలోని తొలి పాదంలోకి ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 9 వరకు ఈ స్థానంలో కొనసాగనున్న శని సంచారం ప్రభావంతో కొన్ని రాశుల వారికి కెరీర్, ఉద్యోగం, ఆదాయం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వృషభం, మిథునం, తుల, మకర రాశుల వారికి ఈ కాలం ప్రయోజనకరంగా ఉండొచ్చని భావిస్తున్నారు.

Lord Shani Dev: శనిదేవుడి అనుగ్రహం.. ఈ రాశులకు కెరీర్, ఆర్థికంగా కలిసొచ్చే కాలం!
Lord Shani Dev

Updated on: Aug 19, 2026 | 12:16 PM

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహ సంచారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శనిదేవుడు రాశి మార్పుతో పాటు నక్షత్ర మార్పు జరిగినప్పుడు కూడా దాని ప్రభావం వివిధ రాశులపై ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న శని.. త్వరలో రేవతి నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించనున్నాడు. 2026 ఆగస్టు 20న శని రేవతి నక్షత్రంలోని తొలి పాదంలోకి ప్రవేశించనున్నాడు. ఈ స్థానంలో శని అక్టోబర్ 9 వరకు కొనసాగబోతున్నాడు. ఈ సమయంలో శ్రమ, బాధ్యత, ఆర్థిక క్రమశిక్షణ, కెరీర్‌ వంటి అంశాలకు ప్రాధాన్యం పెరుగుతుందని జ్యోతిష్య విశ్వాసం. శనిదేవుడి ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభం, మిథునం, తుల, మకరం రాశుల వారికి కెరీర్, ఆదాయం, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతికి అవకాశాలు ఉండొచ్చని అంచనా.

వృషభ రాశి

వృషభ రాశి వారికి శని నక్షత్ర మార్పు అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో కొత్త అవకాశాలు లభించే అవకాశముంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి లేదా జీతం పెరుగుదలకు మార్గం ఏర్పడే సూచనలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభించవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూలమైన సమాచారం అందే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా పరిస్థితులు క్రమంగా మెరుగుపడే సూచనలు ఉన్నాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ కాలం ముఖ్యంగా కెరీర్ పరంగా ప్రయోజనకరంగా ఉండొచ్చు. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి కొత్త ప్రతిపాదనలు రావచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు, కాంట్రాక్టుల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు కనిపించవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారం నిమిత్తం చేసే ప్రయాణాలు కూడా అనుకూల ఫలితాలను ఇవ్వొచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

తుల రాశి

తుల రాశి వారికి కార్యాలయంలో కొనసాగుతున్న కొన్ని సమస్యలు తగ్గే అవకాశం ఉంది. సహోద్యోగుల నుంచి సహకారం లభించడంతో ముఖ్యమైన పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త అవకాశాలు రావచ్చు. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తాయి. సంపాదించిన డబ్బును సక్రమంగా పొదుపు చేసుకోవడంలో కూడా విజయం సాధించే అవకాశం ఉంది. ఈ సమయంలో చేసే ప్రయత్నాలకు అదృష్టం కూడా తోడయ్యే అవకాశముంది.

మకర రాశి

మకర రాశి వారికి శని నక్షత్ర మార్పు ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశం ఉంది. గతంలో చేసిన కష్టానికి తగిన ఫలితం లభించే పరిస్థితులు ఏర్పడుతాయి. విదేశాలకు సంబంధించిన ప్రాజెక్టులు లేదా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ కాలం ప్రత్యేకంగా అనుకూలంగా ఉండే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి బలపడటంతో పాటు వృత్తి, సామాజిక రంగాల్లో గుర్తింపు పెరిగే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ జీవితంలో జీవిత భాగస్వామి సహకారం లభించడం ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాల్లో ముందుకు వెళ్లగలుగుతారు.

(గమనిక: పైన పేర్కొన్న ఫలితాలు జ్యోతిష్య విశ్వాసాలు, గోచార ఆధారిత సాధారణ అంచనాలు మాత్రమే. ఇవి శాస్త్రీయంగా నిరూపితమైన కావు)

Loading...
Unable to load recommendations.
Follow Us