AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pournami Horoscope: పౌర్ణమి ప్రభావం.. ఆ రాశుల వారికి రాజ యోగాలు, సుఖ సంతోషాలు

ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు చంద్రుడు ధనుస్సు, మకరం, కుంభ రాశుల్లో సంచారం చేయడం జరుగుతోంది. గురు దృష్టి వల్ల, పౌర్ణమి కారణంగా చంద్రుడు కొన్ని రాశులకు బాగా అనుకూలంగా మారి రాజయోగాలను అనుగ్రహించబోతున్నాడు. ఈ నెల 21, 22 తేదీల్లో ఏర్పడే పౌర్ణమి వరకు కొన్ని రాశులకు మనసులోని కోరికలు నెరవేరడం, మానసిక ప్రశాంతత ఏర్పడడం, అనుకోకుండా హోదా, ఆదాయం పెరగడానికి అవకాశాలు ఏర్పడడం..

Pournami Horoscope: పౌర్ణమి ప్రభావం.. ఆ రాశుల వారికి రాజ యోగాలు, సుఖ సంతోషాలు
Pournami Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 13, 2024 | 6:32 PM

Share

ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు చంద్రుడు ధనుస్సు, మకరం, కుంభ రాశుల్లో సంచారం చేయడం జరుగుతోంది. గురు దృష్టి వల్ల, పౌర్ణమి కారణంగా చంద్రుడు కొన్ని రాశులకు బాగా అనుకూలంగా మారి రాజయోగాలను అనుగ్రహించబోతున్నాడు. ఈ నెల 21, 22 తేదీల్లో ఏర్పడే పౌర్ణమి వరకు కొన్ని రాశులకు మనసులోని కోరికలు నెరవేరడం, మానసిక ప్రశాంతత ఏర్పడడం, అనుకోకుండా హోదా, ఆదాయం పెరగడానికి అవకాశాలు ఏర్పడడం, ముఖ్యంగా అనారోగ్యానికి తగ్గ చికిత్స లభించడం వంటివి జరుగుతాయి. కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఓ వారం రోజుల పాటు జీవితం నిత్య కల్యాణం, పచ్చతోరణంలా సాగిపోయే అవకాశం ఉంటుంది.

  1. కర్కాటకం: ఈ రాశినాథుడైన చంద్రుడు బాగా బలం పడుతున్నందువల్ల ఎటువంటి అనారోగ్యం నుంచైనా చాలావరకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపో తుంది. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకోవడం, ఇష్టమైన ప్రాంతాలను సందర్శించడం వంటివి జరుగుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. పని ఒత్తిడి నుంచి, ఆర్థిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆశించిన శుభవార్తలు వింటారు.
  2. సింహం: ఈ రాశికి చంద్ర సంచారం అనేక విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలోని శుభ గ్రహాల మీద చంద్రుడి దృష్టి పడడంతో పాటు, గురు దృష్టికి కూడా అవకాశం ఉన్నందువల్ల మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరే సూచనలున్నాయి. బంధుమిత్రులతో వివాదాలు తొలగిపోయి, సఖ్యత పెరుగుతుంది. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు.
  3. తుల: ఈ రాశికి చంద్రుడు రాజయోగాలనివ్వడం జరుగుతుంది. ఈ రాశికి దశమాధిపతిగా నాలుగైదు స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగు తుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారు బాగా బిజీ అయిపోవడం జరుగుతుంది. రాబడి విషయంలో ఊహించని పురోగతికి అవకాశం ఉంది. లాభదాయక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  4. వృశ్చికం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన చంద్రుడికి బలం పెరుగుతున్నందువల్ల కెరీర్ పరంగానే కాక, కుటుంబపరంగా కూడా అనుకోని అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రతి ఆదాయ ప్రయత్నమూ నెరవేరుతుంది. అనారోగ్యాలకు సరైన చికిత్స లభిస్తుంది. మానసిక ఉత్సాహం పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులకు తప్పకుండా రాబడి పెరుగుతుంది.
  5. మకరం: ఈ రాశిలోనూ, ధన స్థానంలోనూ చంద్ర సంచారం వల్ల ఈ రాశివారికే కాక, జీవిత భాగస్వామికి కూడా ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. కుటుంబంలో కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది.
  6. మీనం: ఈ రాశివారికి దశమ, లాభస్థానాల్లో చంద్ర సంచారం వల్ల ఉద్యోగంలో అందలాలు ఎక్కే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందు తుంది. ఇంట్లో శుభ కార్యం జరిగే అవకాశం ఉంది. కుటుంబసమేతంగా పుణ్య క్షేత్రాలను సందర్శి స్తారు. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీది బండిలా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ రెట్టింపు ఫలితాలనిస్తాయి. మాతృమూలక ధన లాభం కలుగుతుంది. సంపద పెరుగుతుంది.

Follow Us
ఆ ఉద్యోగాల్లో మాజీ అగ్నివీరులకు వయస్సు, PET నుంచి మినహాయింపు!
ఆ ఉద్యోగాల్లో మాజీ అగ్నివీరులకు వయస్సు, PET నుంచి మినహాయింపు!
కేరళా స్టైల్‌లో ఆ కొబ్బరి నూనెతో ఇలా వండి తింటే ఉంటాదీ..
కేరళా స్టైల్‌లో ఆ కొబ్బరి నూనెతో ఇలా వండి తింటే ఉంటాదీ..
ట్రిగ్గర్‌ నొక్కితే బుల్లెట్ల వర్షమే.. ప్రళయ భీకర ప్రహార్‌ స్పెషా
ట్రిగ్గర్‌ నొక్కితే బుల్లెట్ల వర్షమే.. ప్రళయ భీకర ప్రహార్‌ స్పెషా
సగ్గుబియ్యం పాయసం ఇలా ఒక్కసారి ట్రై చేస్తే మీ ఫేవరెట్ అయిపోతుంది!
సగ్గుబియ్యం పాయసం ఇలా ఒక్కసారి ట్రై చేస్తే మీ ఫేవరెట్ అయిపోతుంది!
14 ఏళ్ల నిరీక్షణకు తెర ?తొలి మ్యాచ్ గండం నుంచి ముంబై బయటపడుతుందా?
14 ఏళ్ల నిరీక్షణకు తెర ?తొలి మ్యాచ్ గండం నుంచి ముంబై బయటపడుతుందా?
మే 5న జరగాల్సిన JEE Main 2026 పరీక్ష వాయిదాకు విజ్ఞప్తులు
మే 5న జరగాల్సిన JEE Main 2026 పరీక్ష వాయిదాకు విజ్ఞప్తులు
డిలీట్‌ చేసిన ఫొటోలు మళ్లీ కావాలంటే ఇలా చేయండి
డిలీట్‌ చేసిన ఫొటోలు మళ్లీ కావాలంటే ఇలా చేయండి
ఓవైపు ఎండ, మరోవైపు వాన.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉంటుందంటే
ఓవైపు ఎండ, మరోవైపు వాన.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉంటుందంటే
వచ్చే వారం వరుసగా 6 రోజులు బ్యాంక్ సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
వచ్చే వారం వరుసగా 6 రోజులు బ్యాంక్ సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
మీ కాలి వేళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఇదే మీ క్యారెక్టర్..
మీ కాలి వేళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఇదే మీ క్యారెక్టర్..