Monthly Horoscope: వారికి ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి.. 12 రాశుల వారికి మాసఫలాలు ఇలా..
మాస ఫలాలు (నవంబర్ 1 నుంచి నవంబర్ 30, 2023 వరకు): నవంబరు మాసంలో మేష రాశి వారికి తప్పకుండా శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. వృషభ రాశి వారికి నెలంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం, ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి నవంబరు మాసఫలాలో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
మాస ఫలాలు (నవంబర్ 1 నుంచి నవంబర్ 30, 2023 వరకు): నవంబరు మాసంలో మేష రాశి వారికి తప్పకుండా శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. వృషభ రాశి వారికి నెలంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం, ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి నవంబరు మాసఫలాలో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గురు, శని, శుక్ర గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సాను కూలపడుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆశలు వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవు తాయి. కొన్ని ప్రయత్నాలు, వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరిగి, క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సామ రస్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొం టారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
లాభ స్థానంలో రాహువు, నాలుగవ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల నెలంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరులకు వీలైనం తగా ఆర్థిక సహాయం అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవుతాయి. కొత్త ప్రయ త్నాలు, కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. సతీమణికి వృత్తి, ఉద్యోగాలపరంగా ఊహించని అదృష్టం పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శి స్తారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ప్రస్తుతం గురు, బుధ, శని గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశివారికి ఈ నెలంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుందని చెప్పవచ్చు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం, ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి. విద్యార్థులు సునా యాసంగా విజయాలు సాధిస్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. అధికారులకు మీరిచ్చే సలహాలు బాగా పనికి వస్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ధన స్థానాధిపతి రవి బుధుడితో చతుర్థ స్థానంలో ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి సజావుగా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్త వుతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడుతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. సతీమణికి వృత్తి, ఉద్యోగాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. డబ్బు నష్టపోయే సూచనలున్నాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ప్రధాన శుభ గ్రహాలైన గురు, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితం వేగం పుంజుకుంటుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించ వచ్చు. సప్తమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి కారణంగా కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆర్థిక విషయాల్లో మోసపోయే సూచనలున్నాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రాశినాథుడైన బుధుడు అనుకూలంగా ఉండడంతో పాటు, షష్టంలో శనీశ్వరుడి సంచారం కూడా యోగం ఇస్తుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉప శమనం లభిస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన సమస్య లను కూడా పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడంలో సతీమణిని కూడా సంప్రదించడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అంద వచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. తలపెట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
గురు, శుక్ర, బుధ, రవి గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. ఆశించిన గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యంగా ధన స్థానంలో శుభ గ్రహాలుండడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయట పడతారు. ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. ఆరోగ్యం విష యంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు చదువుల్లో సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ప్రధాన గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా లేనందువల్ల నెలంతా సీదా సాదాగా గడిచిపోయే అవకాశం ఉంది. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యం ఉన్నా లెక్క చేయకుండా ఇంటా బయటా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఏ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. అధికారు లతో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. వృత్తి, ఉద్యోగాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేసే సూచనలున్నాయి. వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. విద్యార్థులు ఎంతో శ్రమ మీద గానీ ఆశించిన ఫలితాలు సాధించలేరు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి. స్వయం కృషిని నమ్ముకోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
గురు, శనులతో పాటు, శుక్రుడు కూడా బాగా అనుకూరంగా ఉన్నందువల్ల సర్వత్రా మీ మాటకు, చేతకు తిరుగుండదు. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి ఉంటుంది. అధికార యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి, లాభాల బాట పట్టే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. తలపెట్టిన పనులు కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మంచి కంపెనీల నుంచి ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయ త్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలి తాలనిస్తాయి. బంధు మిత్రులకు సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
శని, రాహువు, బుధ, రవి, కుజులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభి స్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలందుతాయి. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు స్వదేశంలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
బుధ గ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించు కుంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. బాధ్యతలు, పనులు బాగా పెరిగి ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ఫలితం, ప్రతిఫలం ఉంటాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలను వెతుకుతారు. వృత్తి, వ్యాపా రాల్లో కొద్దిగా స్తబ్ధత ఏర్పడుతుంది. ఉద్యోగం సాధారణంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ప్రస్తుతానికి హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం చేయవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తిక రంగా సాగిపోతాయి. సతీమణి సహాయ సహకారాలుంటాయి. తల్లితండ్రుల నుంచి సహకారం లభి స్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
గురు, బుధ, రవి గ్రహాలు బాగా అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన రాణింపు ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలను ఎక్కువగా సొంత ఆలోచనలతో నిర్వహించుకోవడం మంచిది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో చక్కని ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.