
జ్యోతిషశాస్త్రంలో గురు గ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. గురువును జ్ఞానం, సంపద, అదృష్టం, సంతానం, శుభకార్యాలకు కారకుడిగా భావిస్తారు. గురు గ్రహం సంచారంలో చోటుచేసుకునే మార్పులు 12 రాశుల వారి జీవితాలపై తప్పనిసరిగా ప్రభావం చూపుతాయని జ్యోతిష నమ్మకం. ప్రస్తుతం గురు గ్రహం సింహ రాశిలో (Jupiter Transit in Leo) సంచరిస్తుండగా.. రాబోయే 75 రోజుల పాటు (25 జనవరి 2027 వరకు) ఇదే రాశిలో కొనసాగనున్నాడు. ఈ సంచారం కారణంగా ఐదు రాశుల వారికి అదృష్టం కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి అంశాల్లో సానుకూల మార్పులు కనిపించే అవకాశముంది. ఇంతకీ గురు అనుగ్రహంతో ప్రయోజనాలు పొందే ఆ ఐదు రాశులేవో తెలుసుకుందాం.
గురు సంచారం మేష రాశి వారికి అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతాయి. గతంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గే సూచనలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కారమై భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి కూడా లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి.
కర్కాటక రాశి వారికి గురు సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపించే అవకాశం ఉంది. ఉద్యోగులు కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఒత్తిడి, పని భారం తగ్గే అవకాశముంది. ఇప్పటివరకు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి వైపు కుటుంబ సభ్యుల నుంచి సహకారం, మద్దతు లభించవచ్చు. నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి.
గురు గ్రహం ప్రస్తుతం ఈ రాశిలోనే సంచరిస్తున్నాడు. దీంతో సింహ రాశి వారికి రాబోయే 75 రోజులు కీలకంగా మారనుంది. జీవితంలో పలు సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భాగస్వామితో ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. చాలాకాలంగా ఆలస్యమవుతున్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు కూడా లాభదాయకమైన సమయంగా ఉంటుంది.
ధనుస్సు రాశి వారికి ఈ గురు సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. వృత్తిపరమైన బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత సాధించే అవకాశం ఉంది. భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా ఉపశమనం లభిస్తుంది.
కుంభ రాశి వారికి గురు సంచారం పలు విధాలుగా ప్రయోజనాలను అందించే అవకాశముంది. గతంలో ఎక్కడైనా డబ్బు నిలిచిపోయి ఉంటే తిరిగి చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఎదురవుతున్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. కెరీర్‌లో ఎదుగుదలకు కొత్త అవకాశాలు లభించే అవకాశముంది. భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. జీవితంలో కొత్త పరిచయాలు, బంధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అయితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో తొందరపాటు తగదని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు.
(గమనిక: ఇవి జ్యోతిషశాస్త్ర విశ్వాసాలు, అంచనాల ఆధారంగా అందించిన వివరాలు మాత్రమే. వీటిని నిర్ధారిత ఫలితాలుగా భావించరాదు)