Horoscope Today: వీరికి ప్రయాణాల్లో ఆటంకాలు.. అనారోగ్య సమస్యలు.. శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (09-07-2022): శుభకార్యాలు జరపాలన్నా, మంచి పనులు మొదలు పెట్టాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా చాలామంది మంచి ముహూర్తం కోసం వెతుకుతారు చాలామంది. అంతెందుకు రోజులో ఏ పని మొదలుపెట్టాలన్నా మంచి చెడుల..

Horoscope Today: వీరికి ప్రయాణాల్లో ఆటంకాలు.. అనారోగ్య సమస్యలు.. శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today

Updated on: Jul 09, 2022 | 6:16 AM

Horoscope Today (09-07-2022): శుభకార్యాలు జరపాలన్నా, మంచి పనులు మొదలు పెట్టాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా చాలామంది మంచి ముహూర్తం కోసం వెతుకుతారు చాలామంది. అంతెందుకు రోజులో ఏ పని మొదలుపెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందోనని ఆరా తీస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు చూస్తారు. అనుకూల సమయాలు మరీ చూసుకుని ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి? రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు. మరి జులై 9 (శనివారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

మేషం
భవిష్యత్ ప్రణాళికల గురించి ఆలోచిస్తారు. తోటివారితో కలిసి శుభకార్యాలు, విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సరికొత్త ఆదాయమార్గాలను అన్వేషిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. పరమేశ్వరుడిన ప్రార్థిస్తే శుభం కలుగుతుంది.

వృషభం
మంచిపనులతో సమాజంలో గొప్ప పేరు తెచ్చుకుంటారు. కీలక విషయాల్లో పురోగతి సాధిస్తారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మిథునం
శ్రమాధిక్యం తప్పవు. తోటివారిని కలుపుకొనిపోవాలి. అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. చంద్ర ధ్యాన శ్లోకం జపిస్తే మంచిది.

కర్కాటకం
ఈరాశివారికి కృషికి తగ్గ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. బంధువులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. పరమేశ్వర స్వామిని దర్శించుకుంటే మేలు జరుగుతుంది.

సింహం
ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఎంతోకాలం ఎదురుచూస్తోన్న కొన్ని వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. అలాగని ఎట్టిపరిస్థితిల్లోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబాను సందర్శిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు.

కన్య
ఒత్తిడికి దూరంగా ఉండాలి. మీకు అనుకూలంగా ఉన్నవాళ్లే శత్రువులుగా మారే అవకాశం ఉంది. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. గణపతి సహస్రనామ పారాయణ పఠిస్తే మంచిది.

తుల
కీలక వ్యవహారాల్లో కుటుంబీకులు, ఆత్మీయుల సహకారం అందుతుంది.మానసిక ప్రశాంతత ఉంటుంది. బంధువులతో కలిసి శుభకార్యాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం జపిస్తే మంచిది.

వృశ్చికం
సమయస్ఫూర్తితో వ్యవహరించి సానుకూల ఫలితాలు పొందుతారు. ఒక శుభవార్త మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. బంధు,మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. శివ అష్టోత్తర శతనామావళి పఠిస్తే శుభం కలుగుతుంది.

ధనస్సు
అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. కీలక విషయాల్లో స్థిరంగా వ్యవహరించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆంజనేయస్వామిని దర్శించుకుంటే మంచిది.

మకరం
వీరికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలకు సంబంధించి ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇష్టదైవారాధన మరవకూడదు.

కుంభం
కీలక వ్యవహరాలు, పనుల్లో తోటివారి సహకారం అందుతుంది. ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యమైన పనుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి మంచి పేరు తెచ్చుకుంటారు.. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సూర్య, చంద్ర ఆరాధన వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు.

మీనం
కీలక వ్యవహరాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సరిపడా ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలపై ఆలోచిస్తారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. పరమేశ్వరుడిని ప్రార్థిస్తే శుభం కలుగుతుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us