Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు కొత్త అవకాశాలు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు..

దిన ఫలాలు (నవంబర్ 25, 2023): మేష రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది కానీ, కొన్ని వృథా ఖర్చులు తప్పకపోవచ్చు. వృషభ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. అయితే, ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు కొత్త అవకాశాలు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు..
Horoscope Today 25th November 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 25, 2023 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 25, 2023): మేష రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది కానీ, కొన్ని వృథా ఖర్చులు తప్పకపోవచ్చు. వృషభ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. అయితే, ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఎంతో ఉత్సాహంగా ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, కొన్ని వృథా ఖర్చులు తప్పకపోవచ్చు. ధనపరంగా ఎటువంటి ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది కానీ, లాభాలు దాదాపు రెట్టింపవుతాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా ఉంటాయి కానీ, స్థాన చలనానికి అవకాశం ఉంది. కొందరు మిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు. సతీమణితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. అయితే, ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. ఉద్యో గంలో అధికారుల సహాయంతో ఉన్నత హోదా పొందే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహా రాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగాలు కూడా సానుకూలంగా ఉంటాయి. ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూల పరి స్థితులుంటాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సర్వత్రా మీ మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితికి భంగం ఉండదు. అనేక మార్గాలలో ఆదాయం పెరుగు తుంది. ఆరోగ్యానికి కూడా ఢోకా ఉండదు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్యల నుంచి సమయస్ఫూర్తిగా బయటపడతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఒకటి రెండు శుభవార్తలతో కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల అండదండలు లభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తి రంగానికి చెందినవారు బాగా బిజీ అయిపోతారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాల్లో కొద్ది శ్రమతో అధిక ఫలితం పొందుతారు. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను, అధి కారాలను తీసుకోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. సంతానప రంగా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండే సూచనలున్నాయి. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అనుకోకుండా కొందరు ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థికపరంగా కొద్దిగా ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. సౌక ర్యాలు పెరగడం, ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి జరుగుతాయి. సతీమణితో కలిసి విలువైన వస్తువులు కొనడం కూడా జరుగుతుంది. మిత్రుల సహాయంతో కొన్ని పెండింగు పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు, హామీలు ఉండవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, వి‌శాఖ 1,2,3)

ముఖ్యమైన ఆలోచనలను, నిర్ణయాలను కార్యరూపంలో పెడతారు. ముఖ్యమైన పనులు, వ్యవ హారాల్లో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి ఒక దైవ కార్యంలో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువులకు సహాయం చేయడం, స్నేహితుల మీద, విలాసాల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోక పోవడం చాలా మంచిది భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ముఖ్యమైన పనులు చురుకుగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల స్పందన లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. సతీమణితో కలిసి ఆలయాలు సంద ర్శిస్తారు. కొద్దిపాటి అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. ప్రతిభా పాట వాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పిల్లలు పురోగతి చెందుతారు. సతీమణికి వృత్తి, ఉద్యోగాలలో గుర్తింపు లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

దూర ప్రాంతంలో ఉంటున్న బంధువులు లేదా పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. విద్యార్థులు నూతన విద్యావకాశాలు పొందే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కుటుంబపరంగా కూడా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం పరవాలేదని పిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా అవాంతరాలుండే అవకాశం ఉంది. ఇంటా బయటా ఊహించని ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార వ్యవ హారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. కొందరు సన్నిహితుల ద్వారా మోసపోయే అవకాశం ఉంది. ఆదాయం పరవాలేదు కానీ, ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చిన్ననాటి స్నేహితులతో విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాలలో రాబడికి లోటుండదు. ఉద్యోగంలో కూడా జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. మీ ఆలోచనలు, ప్రయ త్నాలు సత్ఫలితాలనిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!