దిన ఫలాలు (సెప్టెంబర్ 21, 2024): మేష రాశి వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది.
వృషభ రాశి వారు ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మిథున రాశి వారి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు ఆదాయానికి కొరత ఉండదు. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించేందుకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అయితే, ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. అదనపు ఆదాయానికి లోటుండదు. కొన్ని ముఖ్యమైన అప్పులు తీర్చుకోగలుగుతారు. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలలో హోదా, వేతనాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపా రాలు నిలకడగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగుల పనితీరు పట్ల అధికారులు సంతృప్తి చెందుతారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవ కాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. ప్రత్యేక బాధ్యతలు అప్ప గిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు కొద్ది ప్రయత్నంతో పూర్త వుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. ఆదాయానికి లోటుండదు. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక వ్యవ హారాల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఇంట్లో శుభ కార్యం నిర్వహించడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్నందువల్ల ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు అవసరం.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగులు షేర్లు, చిన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. ఇష్ట మైన బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పను లన్నీ సకాలంలో పూర్తవుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. హోదా, వేతనాలు పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో లాభాలు బాగా పెరు గుతాయి. ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధికి అవకాశం ఉంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయి కొద్దిగా ఊరట చెందుతారు. ఆస్తి విషయంలో తోబుట్టువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలి స్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట )
వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొం టుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధువులతో విభేదాలు తలెత్తే సూచన లున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో బాగా రాణించే అవకాశం ఉంది. కొత్త గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టి విటీ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఇతరులు బాగా ఉపయో గించుకుంటారు. కొందరు బంధువుల వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎవరికీ ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆదాయం స్థిరంగా కొనసాగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ జీవి తం సామరస్యంగా, సంతోషంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల చదువులకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి అనుకోకుండా బయటపడతారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితంలో కొన్ని సమస్యలను, ఇబ్బందికర పరిస్థితులను అధిగమిస్తారు. వృత్తి, వ్యాపా రాల్లో ఆశించిన రాబడి ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రయాణాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరిగి ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం అవసరం. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. మిత్రులతో సరదాగా గడుపుతారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. తోబుట్టువుల నుంచి శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాల నిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతికి అవకాశం ఉంది. వ్యాపారాలు ఆర్థికంగా పుంజుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగు లకు అవకాశాలు అందివస్తాయి. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.