Horoscope Today: వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం తథ్యం.. 12 రాశులవారికి దినఫలాలు
దినఫలాలు (అక్టోబర్ 16, 2023): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే సూచనలున్నాయి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు ఆరోగ్యంపరంగా, ఆర్థికంగా, 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
దినఫలాలు (అక్టోబర్ 16, 2023): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే సూచనలున్నాయి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గురువు ఇదే రాశిలో సంచారం చేస్తున్న కారణంగా ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. అశ్విని, భరణి నక్షత్రాల వారికి మంచి యోగం పడుతుంది. తోబుట్టువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. సమాజంలో ప్రముఖుల నుంచి గౌరవ మర్యా దలు లభిస్తాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
నాలుగవ స్థానంలో శుక్ర గ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే సూచనలున్నాయి. రోహిణి నక్షత్రం వారికి మరింతగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువులను తలదూర్చనివ్వవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
పునర్వసు నక్షత్రం వారికి సమాజంలోని అతి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుంది. ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైన సమాచారం అందుకుంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
శుక్ర, రవి, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందు వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆస్తి వివా దం ఒకటి పరిష్కారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. పుష్యమి నక్షత్రం వారికి ఆర్థిక పరిస్థితి మరింతగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల మీద ఆధారపడడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ధన స్థానం బలంగా ఉండడం వల్ల ఆదాయ మార్గాలుగా పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయ త్నాలు పెరిగే అవకాశం ఉంది. కొద్దిపాటి ఆటంకాలు, ఇబ్బందులున్నా ఆస్తిపాస్తులకు సంబం ధించిన కొన్ని అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయక పోవడం మంచిది. పుబ్బా నక్షత్రం వారికి వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు తొలగుతాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అసంతృప్తి ఏర్పడుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రవి, బుధులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉత్తర నక్షత్రం వారికి అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గు తుంది. పదోన్నతికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
శుక్ర, గురువుల అనుకూలత కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో సామాన్య ఫలితాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవ హారాలు నత్తనడక నడుస్తాయి. కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. స్వాతి, విశాఖ నక్షత్రాల వారికి ఊహించని కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. కొత్త ఆలోచనలకు, కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు ఏర్పడతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
రవి, బుధుల బలం కారణంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ఏం చేసినా చలా మణీ అవుతుంది. అధికారులు కొత్త బాధ్యతలను అప్పజెప్పే అవకాశం ఉంది. వృత్తి జీవి తంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. జ్యేష్టా నక్షత్రం వారికి వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
బుధ, రవి, శని, గురు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్రం వారికి యాక్టి విటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలో జోరందుకుంటాయి. డబ్బు నష్టపోవడం గానీ, మోస పోవడం గానీ జరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. తలపెట్టిన పనులు పూర్తవు తాయి. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
శని, బుధుల బలం బాగా అనుకూలంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఆశించిన శుభ వార్త అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ప్రోత్సా హకాలు అందుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఎటువంటి వ్యాపారాలు చాలా వరకు లాభాల బాటలో సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన అనుకూలత ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పూర్వాభాద్ర నక్షత్రం వారికి ఆర్థికంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. ప్రతిష్ఠాత్మక కంపెనీల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపా రాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
గురు బలం బాగా అనుకూలంగా ఉంది. అందులోనూ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. వ్యక్తిగత సమ స్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో బరువు బాద్యతలు పెరిగే సూచనలు న్నాయి. అధికారులు మీ పనితీరును బాగా మెచ్చుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరి స్థితులు నెలకొంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.