Horoscope April 2025: ఏప్రిల్‌లో ఐదు గ్రహాల సంచారం.. ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

జ్యోతిష్య శాస్త్రంలో రాశులు, నవ గ్రహాలు తమ గమనాన్ని నిర్దిష్ట సమయంలో మార్చుకుంటూ ఉంటాయి. ఏప్రిల్‌లో సూర్యుడు, కుజుడు సహా 5 గ్రహాలు తమ గమనం మార్చుకోనున్నాయి. దీంతో కొన్ని రాశులకు అదృష్టాన్ని కలిగిస్తాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉంటాయి. ఏప్రిల్‌లో 5 గ్రహాల గమనం మారుతుంది. దీంతో కొన్ని రాశులకు కష్టాలను, కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకొస్తాయి ఈ గ్రహాలు. కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల ఆదాయంలో పెరుగుదల, పనిలో పదోన్నతిని చూసే అవకాశం ఉంది.

Horoscope April 2025: ఏప్రిల్‌లో ఐదు గ్రహాల సంచారం.. ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
Horoscope April 2025

Updated on: Apr 02, 2025 | 4:35 PM

వేద పంచాంగం ప్రకారం గ్రహాల సంచారానికి సంబంధించి ఏప్రిల్ నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలో శని ఉదయిస్తాడు. అదే సమయంలో గ్రహాల రాజు సూర్యుడు ఉన్నతమైన మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనితో పాటు ఈ రోజున ( ఏప్రిల్ 2) శుక్రుడు మీనరాశిలోకి, కుజుడు కర్కాటకరాశిలోకి ప్రవేసించనున్నాడు. ఇక్కడ బుధుడు ఉదయిస్తాడు. అందువల్ల ఏప్రిల్‌లో 5 గ్రహాల గమనంలో మార్పు ఉంటుంది. దీంతో కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకుని రానున్నాయి. అలాగే కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు ఆదాయంలో పెరుగుదల, ఉద్యోగస్తులకు పదోన్నతి కలిగే అవకాశం ఉంది. ఈ రోజు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం…

మకర రాశి: ఏప్రిల్ నెల ఈ రాశికి చెందిన వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మార్చి 29న శని మీ రాశిలోకి ప్రవేశించిన వెంటనే వీరు శని బాధల నుంచి విముక్తి పొందుతారు. అందువలన పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఈ నెలలో వీరు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందనున్నారు. కెరీర్ లో ప్రమోషన్లు అందుకునే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సమయం ఆర్థిక పరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది. అలాగే ఈ సమయంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ప్రమోషన్లు పొందవచ్చు.

మిథున రాశి: ఈ రాశి వారికి ఏప్రిల్ నెల సానుకూలంగా ఉంటుంది. ఈ నెలలో వీరికి విపరీతంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈసారి వీరి కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశం పొందుతారు. పనిలో మీ కృషికి తగిన ప్రశంసలు లభిస్తాయి. అలాగే ఈ సమయంలో వీరు విదేశాలకు ప్రయాణించే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో ఉద్యోగుల జీతాలు పెరగవచ్చు. దీనితో పాటు పనిని పెంచడానికి కొత్త ప్రణాళికలు రూపొందించనున్నారు. విజయం సాధిస్తారు. ఈ సమయానికి మీ పని పూర్తవుతుంది. దీనితో పాటు వీరు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఏప్రిల్ నెల శుభప్రదంగా, ఫలవంతంగా ఉంటుంది. మార్చి 29న శని సంచారము జరిగినందున ఈ రాశికి చెందిన వ్యక్తులు శని ప్రభావం నుంచి విముక్తి పొందుతారు. ఈ సమయంలో వీరు చేపట్టిన పని పూర్తవుతుంది. దీనితో వీరికి మనశ్శాంతి లభిస్తుంది. జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. డబ్బును సంపాదించడానికి వీరికి ప్రత్యేక అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు. వ్యాపారులకు సమయం బాగుంటుంది. వ్యాపారాన్ని విస్తరించాలని కోరుకున్నవారికి ఈ సమయం శుభప్రదం. పోటీ విద్యార్థులు ఏ పరీక్షలోనైనా విజయం సాధిస్తారు. మీరు వాహనం లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేయాలనుకుంటే ప్రయత్నాలు ఫలిస్తాయి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us