Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు తమ ప్రేమను ఎక్కువ కాలం నిలుపుకోలేరు.. బ్రేకప్స్ ఎక్కువగా అవుతాయి..

ప్రేమ (Love).. రెండు మనసుల కలయిక.. మాటలకు అందని భావాల మధురానుభూతి. తమ జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరు ఎదో ఒక దశలో ప్రేమలో పడిపోయే ఉంటారు.

Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు తమ ప్రేమను ఎక్కువ కాలం నిలుపుకోలేరు.. బ్రేకప్స్ ఎక్కువగా అవుతాయి..
Zodiac Signs

Updated on: Feb 17, 2022 | 9:30 PM

ప్రేమ (Love).. రెండు మనసుల కలయిక.. మాటలకు అందని భావాల మధురానుభూతి. తమ జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరు ఎదో ఒక దశలో ప్రేమలో పడిపోయే ఉంటారు. కొందరు తమ ప్రేమను పెళ్లితో విజయవంతం చేసుకోగా.. మరికొందరు విఫలం అయిపోతారు. అందరికి ప్రేమ తీపి జ్ఞాపకంగా ఉంటుంది.. అలాగే కొందరికి చేదు జ్ఞాపకంగా మారిపోతుంది. అయితే ఇలా బ్రేకప్స్ జరగడానికి కారణం మీకు మీరుగా చేసుకున్న పొరపాట్లు కావచ్చు.. అలాగే మరికొన్ని జోతిష్య శాస్త్రం ప్రకారం జరిగిపోయి ఉండవచ్చు.. నిజమే.. ఇద్దరి మనసులు కలవడానికి అభిరుచులు.. ఆలోచనలు కలిస్తే సరిపోతుంది.. కానీ ఆ ప్రేమ పెళ్లి పీటలను చేరాలంటే అందుకు వారి జాతక చక్రాలు కూడా కలవాలంటారు పెద్దలు. అందుకే మన భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలిస్తారు.

అయితే జోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు తమ ప్రేమను ఎక్కువ రోజులు నిలుపుకోలేరు. ఎక్కువసార్లు వారి ప్రేమలు విఫలం అవుతాయట. అందులో ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి లవ్ బ్రేకప్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రేమ వీరికి ఎప్పటికీ ఓ చేదు జ్ఞాపకంగానే ఉండిపోతుంది. మరీ ఆ నాలుగు రాశులు ఏంటో తెలుసుకుందామా.

మిథున రాశి..
ఈరాశుల వారు తొందరగా ప్రేమలో పడిపోతారు. వీరు ప్రేమకు.. బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మీరు ఎదుటివారిని ఎంతగా ప్రేమించిన.. అదే అప్యాయతను.. ప్రేమ వారి నుంచి మీకు రాదు. తక్కువ సమయంలోనే వారు ప్రేమించడం లేదు అనే విషయం తెలిసిపోతుంది. అందుకే ఈ రాశివారికి ఊహించని విధంగా ఆకస్మాత్తుగా బ్రేకప్స్ అవుతాయి.

తుల రాశి..
ఈ రాశి వారు తొందరగా ప్రేమలో పడిపోతారు.. అంతేకాకుండా.. వీరు అందించే ప్రేమను, అప్యాయతను ఇతరుల నుంచి ఆశిస్తారు. కానీ వీరు ఎదుటివారి నుంచి అంతే ప్రేమ తిరిగి పొందలేరు.. ఫలితంగా అతి తక్కువ సమయంలోనే వీరి ప్రేమ బంధం ముక్కలవుతుంది. తుల రాశి వారు ఎప్పుడు.. తాము ప్రేమించిన మొదట్లో ఎంత ప్రేమను…అభిమానాన్ని చూపించారో రానున్న రోజుల్లోను అంతే ప్రేమ ఉండాలనుకుంటారు. కానీ వీరికి తమకు ఇష్టమైన వారి నుంచి ప్రతిసారి నిరాశే ఎదురవుతుంది. దీంతో తక్కువ సమయంలో బ్రేకప్ జరుగుతుంది.

కర్కాటక రాశి..
వీరు ఎంత తొందరగా ప్రేమలో పడతారో…అంతే తొందరగా విడిపోతారు. అంటే మీ ప్రేమను ఒప్పుకున్నవారు.. మీకు మరుసటి రోజే బ్రేకప్ చెప్పేస్తారు. మీ ప్రేమను నిలుపుకోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన వ్యర్థమే అవుతుంది. ప్రతి సారి మీరు మీ ప్రేమ కోసం తాపత్రాయపడుతుంటారు. కానీ.. ప్రేమ మీకు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

వృషభ రాశి..
ఈ రాశివారు..తమకు ఇష్టమైనవారిని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ ఇతరులు వీరి ప్రేమను అర్థం చేసుకోలేరు. ఫలితంగా బ్రేకప్ చెబుతుంటారు. వీరి ప్రేమను నిలుపుకోవడంలో ఎప్పుడూ విఫలమవుతుంటారు. రోజులు గడుస్తున్న కొద్ది వీరి ప్రేమ మసకబారిపోతుంది. వీరి ప్రేము కోల్పోతే పూర్తిగా ఆ బంధాన్ని వదిలేసామని అనుకుంటారు.

Also Read: Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rashmika Mandanna: లవ్ మ్యారేజ్ చేసుకోవడం పై నోరు విప్పిన నేషనల్ క్రష్.. అతడే నా భర్త అంటూ..

Horoscope Today: వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువ.. చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..

Mirnalini Ravi: ఎర్ర చీరలో వయ్యారాలు వలకబోస్తున్న ‘మృణాళిని రవి’ లేటెస్ట్ ఫొటోస్…

Loading...
Unable to load recommendations.
Follow Us