
దీపావళి పండుగ అంటేనే దీపాల వెలుగులు, లక్ష్మీదేవి ఆరాధన, సంతోషాలు, సంపదకు ప్రతీక. ఈ ఏడాది దీపావళి పర్వదినం జ్యోతిష్యపరంగా కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. ముఖ్యంగా ఈ సమయంలో రెండు శుభ రాజయోగాలు ఏర్పడనున్నాయి. వాటి ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు రాజయోగాల్లో ఒకటి లక్ష్మీనారాయణ రాజయోగం కాగా, మరొకటి బుధాదిత్య రాజయోగం. సుమారు 71 ఏళ్ల తర్వాత దీపావళి రోజున ఈ రెండు రాజయోగాలు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. మరి ఈ యోగాల ప్రత్యేకత ఏమిటి? ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండనున్నాయి? తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో కలిసినప్పుడు లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. బుధుడిని తెలివితేటలు, వ్యాపారం, వాణిజ్యానికి కారకుడిగా భావిస్తారు. శుక్రుడు సుఖసంతోషాలు, విలాసాలు, సంపద, భౌతిక సౌకర్యాలకు ప్రతీకగా చెబుతారు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఆర్థిక పురోగతి, వ్యాపార అభివృద్ధి, సౌకర్యాలు పెరుగుతాయి. అందుకే ఈ రాజయోగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో కలిసినప్పుడు బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం తెలివితేటలు, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, వృత్తిపరమైన అభివృద్ధికి అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ యోగం ప్రభావంతో కొందరికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు దక్కే అవకాశం ఉంది.
ఈ రెండు రాజయోగాలతో అదృష్టంపట్టే 4 రాశులివే..
మిథున రాశి వారికి ఈ రెండు రాజయోగాలు అనుకూల ఫలితాలను అందించే అవకాశముంది. సృజనాత్మక ఆలోచనలతో కొత్త పనుల్లో ముందుకు సాగుతారు. విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరిగి మంచి పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి.
తులా రాశి వారికి ఈ సమయం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రాశిలో మూడు గ్రహాల కలయికతో త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది. వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి వారికి ఈ రాజయోగాలు ఆర్థికంగా అనుకూలంగా ఉంటాయి. గతంలో వేసుకున్న ప్రణాళికలకు ఇప్పుడు మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఆదాయ పరిస్థితి మెరుగుపడుతాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి సానుకూల సమాచారం అందుతుంది. గతంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నుంచి క్రమంగా ఉపశమనం లభించే అవకాశాలున్నాయి.
(ముఖ్య గమనిక: ఈ కథనంలో అందించిన అంశాలు జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా అందించినవి. వీటికి శాస్త్రీయంగా నిరూపితమైన ఆధారాలు లేవు. వ్యక్తిగత జాతకం, గ్రహస్థితుల ఆధారంగా ఫలితాలు మారుతాయని జ్యోతిష్యులు భావిస్తారు)