AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు తప్పక తెలుసుకోండి!

Ash Gourd for Evil Eye Protection: ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను ఎందుకు కడతారు? దిష్టి నివారణ కోసం కట్టే గుమ్మడికాయను కడగకూడదా? తొడిమ ఎలా ఉండాలి? ఏ రోజు, ఏ సమయంలో కట్టాలి? సంప్రదాయ విశ్వాసాల ప్రకారం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవే.

బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు తప్పక తెలుసుకోండి!
Ash Gourd For Evil Eye Protection
Rajashekher G
|

Updated on: Sep 07, 2026 | 8:32 PM

Share

Ash Gourd for Evil Eye Protection Telugu: మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నా.. వ్యాపారం ప్రారంభించినా.. దిష్టి తగలకుండా ఇంటి లేదా దుకాణం ముందు బూడిద గుమ్మడికాయను వేలాడదీయడం చాలామందికి ఆనవాయితీ. బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే నరదిష్టి, కనుదిష్టి వంటి ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని సంప్రదాయ విశ్వాసం. అయితే దిష్టి నివారణ కోసం కట్టే బూడిద గుమ్మడికాయను కొన్ని నియమాలు పాటిస్తూ ఏర్పాటు చేయాలని పండితులు చెబుతారు.

గుమ్మడికాయను కడగకూడదట..

దిష్టి కోసం ఇంటి ముందు కట్టే బూడిద గుమ్మడికాయను నీటితో కడగకూడదని సంప్రదాయ నమ్మకం. గుమ్మడికాయను శుభ్రం చేయాలనే ఉద్దేశంతో కడగడం వల్ల దాని ఆధ్యాత్మిక శక్తి తగ్గుతుందని కొందరు విశ్వసిస్తారు. అందుకే కడగకుండా గుమ్మడికాయకు పసుపు, కుంకుమ పెట్టి పూజా విధానంలో భాగంగా ఇంటి ముందు వేలాడదీయాలని చెబుతారు.

తొడిమ ఊడిపోయిన గుమ్మడికాయ వద్దు

ఇంటి ముందు కట్టేందుకు ఎంచుకునే బూడిద గుమ్మడికాయకు తొడిమ ఉండటం ముఖ్యమని భావిస్తారు. ఇంటికి తీసుకొచ్చే సమయంలో తొడిమ పట్టుకుని లాగడం లేదా దాని ద్వారా గుమ్మడికాయను ఎత్తడం వల్ల తొడిమ ఊడిపోయే అవకాశం ఉంటుంది. అలా తొడిమ ఊడిపోయిన గుమ్మడికాయను దిష్టి నివారణ కోసం ఇంటి ముందు కట్టకూడదని సంప్రదాయ విశ్వాసం.

ఇవి కూడా చదవండి

గుమ్మడికాయను తిరగేసి తీసుకురావద్దట

బూడిద గుమ్మడికాయను ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలని చెబుతారు. ముఖ్యంగా గుమ్మడికాయను తలకిందులుగా లేదా తిరగేసి పట్టుకుని తీసుకురాకుండా, తొడిమ పైవైపు ఉండేలా తీసుకురావాలని సూచిస్తారు. ఇలా చేయడం వల్ల దిష్టి నివారణకు సంబంధించిన దాని శక్తి నిలిచి ఉంటుందని సంప్రదాయంగా నమ్ముతారు.

ఎప్పుడు కట్టాలి?

బూడిద గుమ్మడికాయను ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి ముందు కట్టకూడదని కొందరు పండితులు సూచిస్తారు. ముఖ్యంగా అమావాస్య రోజున కట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఆ రోజున బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు ఏర్పాటు చేస్తే నరదిష్టి, కనుదిష్టి వంటి ప్రతికూల ప్రభావాలు తొలగుతాయని విశ్వాసం. అమావాస్య రోజున కుదరకపోతే బుధవారం లేదా శనివారం కూడా కట్టవచ్చని చెబుతారు. ఏ రోజున ఏర్పాటు చేసినా సూర్యోదయానికి ముందే కట్టడం మంచిదని సంప్రదాయ నమ్మకం.

పసుపు, కుంకుమతో పూజించి కట్టాలి

బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు కట్టే ముందు ఒక పెద్ద ప్లేట్‌లో ఉంచి పసుపు రాయాలి. అనంతరం కుంకుమ బొట్లు పెట్టి పూజించిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయాలని చెబుతారు. అయితే ఇవన్నీ సంప్రదాయ విశ్వాసాలు, ఆచారాలకు సంబంధించిన విషయాలే. వీటికి శాస్త్రీయంగా దిష్టి లేదా ప్రతికూల శక్తులను తొలగించే సామర్థ్యం ఉందని నిర్ధారణ కాలేదు. కుటుంబ ఆచారం, నమ్మకాలకు అనుగుణంగా వీటిని పాటించవచ్చు.

(Disclaimer: ఈ కథనంలోని విషయాలు సంప్రదాయ విశ్వాసాలు, ఆచారాల ఆధారంగా అందించబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని భావించరాదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?
పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !
పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !
దొంగల భయం.. కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమే!
దొంగల భయం.. కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమే!