ఏపీ సచివాలయంలో కరోనా.. 3,4 బ్లాకులు మూసివేత..!

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. ఏపీ సచివాలయంపై కరోనా ప్రభావం పడింది. సచివాలయంలోని 3,4 బ్లాకుల్లో విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఏపీ సచివాలయంలో కరోనా.. 3,4 బ్లాకులు మూసివేత..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 01, 2020 | 3:36 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. ఏపీ సచివాలయంపై కరోనా ప్రభావం పడింది. సచివాలయంలోని 3,4 బ్లాకుల్లో విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో, సచివాలయం మొత్తం రసాయన ద్రావణాలు శానిటైజ్ చేస్తున్నారు. 3,4 బ్లాకుల్లోకి ప్రవేశం నిషేధించారు. దాంతో, ఈ రెండు బ్లాకుల ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. కాగా, కరోనా సోకిన ఉద్యోగితో సన్నిహితంగా మెలిగిన మిగతా ఉద్యోగులకు క్వారంటైన్ విధించారు.

కాగా.. గడచినా 24 గంటల్లో ఏపీలో కొత్తగా 104 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏపీకి చెందినవి 76 కాగా.. ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 28 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా.. నమోదైన కేసులతో కలిపితే ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3,118కి చేరింది.

Also Read: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం.. మార్గదర్శకాలు ఇవే!