కరోనా వేళ.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆరు నెలల పాటు..

ఓ వైపు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జగన్‌ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యవసర సేవల చట్టం ఎస్మాను తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇక ఆరు నెలలపాటు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సర్వీసులను దీని కిందకు తీసుకురానుంది. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ ఎస్మా పరిధిలోకి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని […]

కరోనా వేళ.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆరు నెలల పాటు..
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2020 | 7:29 PM

ఓ వైపు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జగన్‌ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యవసర సేవల చట్టం ఎస్మాను తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇక ఆరు నెలలపాటు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సర్వీసులను దీని కిందకు తీసుకురానుంది. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ ఎస్మా పరిధిలోకి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బంది రానున్నారు.

ఎస్మా పరిధిలోకి వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణా,మందుల కొనుగోలు, రవాణా, తయారీ, అంబులెన్స్‌ సర్వీసులు, మంచినీరు, విద్యుత్‌ సరఫరా, భద్రత, ఆహార సరఫరా, బయో మెడికల్‌ వేస్ట్‌ను కూడా ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు ఏపీలో గత నాలుగైదు రోజులుగా కరోనా కేసుల నమోదు పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో తొలి కరోనా మరణం కూడా నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగానే ఉన్నా.. ముందు జాగ్రత్తలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.