ఇళ్ల మార్గదర్శకాల్లో ఏపీ ప్రభుత్వం సవరణలు.. ఐదేళ్ల తరువాత

ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇస్తోన్న ఇళ్ల మార్గదర్శకాల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇళ్ల మార్గదర్శకాల్లో ఏపీ ప్రభుత్వం సవరణలు.. ఐదేళ్ల తరువాత
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2020 | 6:14 PM

ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇస్తోన్న ఇళ్ల మార్గదర్శకాల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు ఏళ్ల అనంతరం ఆ ఇంటిని అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా నవరత్నాల్లో భాగంగా ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని ఆడవారి పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తామని.. అవసరమైతే ఆ ఇంటి మీద పావలా వడ్డీకే బ్యాంకులో రుణం ఇప్పిస్తామని జగన్ పేర్కొన్నారు.

Read This Story Also: ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం