ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌.. కొవిడ్‌ వాక్సిన్ పంపిణిపై చర్చ.. మార్గదర్శక ప్రణాళిక ఉండాలన్న సీఎం వైఎస్ జగన్‌

కొవిడ్‌ నిరోధక వ్యాక్సిన్‌కు సంబంధించి వివిధ అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు.

ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌..  కొవిడ్‌ వాక్సిన్ పంపిణిపై చర్చ.. మార్గదర్శక ప్రణాళిక ఉండాలన్న సీఎం వైఎస్ జగన్‌
Follow us

|

Updated on: Nov 24, 2020 | 2:50 PM

కొవిడ్‌ నిరోధక వ్యాక్సిన్‌కు సంబంధించి వివిధ అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు. వ్యాకిన్‌ తయారీ, వ్యాక్సినేషన్‌ ప్రాధాన్యతలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, పంపిణీ సందర్భంలో అనుసరించాల్సిన పద్ధతులపై ఈ సందర్భంగా ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించారు.

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మొదటగా ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కేరళ, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, హరియానా, రాజస్తాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సీఎంలతో సమావేశం అయ్యారు. అనంతరం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

అంతకుముందు తిరుమల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులకు స్వాగతం పలికిన అనంతరం సీఎం జగన్‌ ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కొవిడ్‌ నిరోధక వ్యాక్సిన్‌కు సంబంధించిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ చర్చించారు. వ్యాక్సిన్‌ పంపిణీలో అనుసరించే శీతలీకరణ పద్ధతులు, అందుకు కావల్సిన మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై దృష్టి పెట్టాలని సీఎం జగన్.. ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు.

అనంతరం ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం వైఎస్ జగన్ పలు కీలక సూచనలు చేశారు. నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్‌ను నిల్వ చేయడం, అంతే కాకుండా అదే ఉష్ణోగ్రతలో మారుమూల ప్రాంతాలకు దాన్ని తరలించడానికి సంబంధించిన కీలక అంశాలు, దీనిపై కూడా మార్గదర్శక ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆయా అంశాలపై సాంకేతిక సమాచారం సేకరించాలని, వివిధ కంపెనీల నుంచి కూడా సంబంధిత సమాచారం తీసుకుని అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. వ్యాక్సిన్‌ సంబంధిత అంశాలపై కూడా మరో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశం

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ