కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి : ఏపీ బీజేపీ చీఫ్ కన్నా డిమాండ్

ఏపీలో పాలనా వికేంద్రీకరణపై బీజేపీ గత కొంతకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. రాయలసీమ ప్రాంతాన్ని పాలనా పరంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం రాయలసీమ కరువు పరిస్థితిపై స్పందించడం లేదని విమర్శించారు. రాయలసీమ జిల్లాల్లో ఒక్కటైన కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ప్రకాశం జిల్లాను వెనుకబడిన […]

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి :  ఏపీ బీజేపీ చీఫ్  కన్నా  డిమాండ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 14, 2019 | 8:05 PM

ఏపీలో పాలనా వికేంద్రీకరణపై బీజేపీ గత కొంతకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. రాయలసీమ ప్రాంతాన్ని పాలనా పరంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం రాయలసీమ కరువు పరిస్థితిపై స్పందించడం లేదని విమర్శించారు. రాయలసీమ జిల్లాల్లో ఒక్కటైన కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని కన్నా కోరారు. గత ప్రభుత్వం మాదిగా కాకుండా వైసీపీ ప్రభుత్వమైనా కేంద్రానికి సహకరించాలన్నారు. ఇలా సహకరిస్తే కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మార్గం సుగమవుతుందని కన్నా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, రాజధాని అమరావతిని తరలిస్తే ఊరుకోమంటూ బీజేపీ అధ్యక్షుడు ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు అదే పార్టీకి చెందిన కర్నూలుకు చెందిన ఎంపీ టీజీ వెంకటేశ్.. మాత్రం కొంచెం స్వరాన్ని పెంచి ఏపీకి రెండు రాజధానులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీకి చెందిన నేతలు వేరువేరుగా ప్రకటనలు.. డిమాండ్‌లు చేస్తుండటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. గతంలో ఐదేళ్లపాటు పాలించిన టీడీపీని కర్నూలులో కోర్టు ఏర్పాటు చేయాలని ఎందుకు నిలదీయలేదని, రెండు రాజధానులు కావాలని గతంలో ఎందుకు డిమాండ్ చేయలేదంటూ ప్రశ్నిస్తున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు