ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.. ఓ వైపు సోషల్ మీడియా అరెస్టులు, మరో వైపు అదానీ వ్యవహారం.. ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.. సంక్రాంతి నుంచి జిల్లాల పర్యటన చేయనున్నట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు.. తాడేపల్లిలో జరిగిన వైసీపీ నేతల సమావేశంలో జగన్ ఈ ప్రకటన చేశారు. ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని.. కష్టాలు ఉన్నప్పుడు గట్టిగా నిలబడితే అధికారంలోకి వస్తామని అన్నారు.
జిల్లాల పర్యటనలో నేతలతో నేరుగా కార్యకర్తలతోనే జగన్ సమావేశం కానున్నారు.. సంక్రాంతి తర్వాత నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ పర్యటనలో ప్రతి బుధ, గురువారం కార్యకర్తలతోనే జగన్ సమావేశం కానున్నారు.
పార్టీ బలోపేతానికి వారి నుంచే స్వయంగా సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారు. అలాగే రోజుకు మూడు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీ కానున్నట్లు జగన్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..