దాడులపై ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. ఇదే అంశంపై ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నా చుట్టూ ఏపీలో మాటల యుద్ధం మొదలైంది. ధర్నాకు ఇండి కూటమి నేతలు హాజరవ్వడంపై కొత్త ఈక్వేషన్‌ను తెరపైకి తెచ్చింది టీడీపీ. వైసీపీ టార్గెట్‌గా ఏపీలో కూటమి ప్రభుత్వం దాడులు చేస్తోందంటూ ఢిల్లీ వేదికగా ధర్నా చేసిన వైసీపీ అధినేత జగన్‌కు.. పలు రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ మినహా.. ఇండి కూటమికి చెందిన కీలక నేతలు.. వైసీపీ ధర్నా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఇదే అంశం ఇప్పుడు ఏపీలో రచ్చకు కారణమైంది.
ఇండి కూటమి నాయకులతో చర్చల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లాడని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఇండి కూటమిలో చేరే అంశంపై మాట్లాడటానికి అయితే జగన్ ధైర్యంగా వెళ్లాలని సూచించారు. ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీ నేతలను ఆహ్వానించామన్నారు. మాకు అండగా ఉండి, మాతో కలిసొచ్చే పార్టీలతో భవిష్యత్‌లోనూ కలిసి పోరాడతామని క్లారిటీ ఇచ్చారు.
ఢిల్లీలో ధర్నాకు కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలపకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్. ఇండి కూటమి నేతలు సంఘీభావం తెలిపినా కాంగ్రెస్ ఎందుకు రాలేదో వాళ్లనే అడగాలన్నారు. టీడీపీకి, కాంగ్రెస్‌కి.. చంద్రబాబుకి, రేవంత్‌కి మధ్య సంబంధం ఏంటో వాళ్లే చెప్పాలన్నారు జగన్. ఇండి కూటమి నేతలతో చర్చల కోసమే జగన్ ఢిల్లీకి వెళ్లారన్న టీడీపీ నేతల కామెంట్స్‌పై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..