Palnadu district: షటిల్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన యువకుడు.. ఆస్పత్రికి తరలించగా…

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఓ యువకుడు షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గేమ్ ఆడుతుండగా.. ఈ ఘటన జరిగింది.

Palnadu district: షటిల్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన యువకుడు.. ఆస్పత్రికి తరలించగా...
Heart Attack
Follow us

|

Updated on: Jun 22, 2022 | 3:43 PM

AP News: లైఫ్‌లో నెక్ట్స్‌ సెకన్‌కి గ్యారంటీ లేదు. ఉంటామో, పోతామో తెలియదు. కరోనా అనంతరం.. గుండెపోట్లు పెరిగాయి.  మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు సైతం ప్రమాదకరంగా మారుతున్నాయి. అప్పటివరకు ఆడుతూ, పాడుతూ సరదగా గడిపిన వారు కొన్నిసార్లు అకస్మాత్తుగా విగతజీవులుగా మారిపోతున్నారు. తాజాగా క్షణకాలంలో ఓ యువకుడి ప్రాణం పోయింది. అప్పటివరకు యాక్టివ్‌గా షటిల్‌ ఆడిన కిషోర్ అనే యువకుడు.. సడెన్‌గా కుప్పకూలిపోయాడు. అతనితో పాటు షటిల్ ఆడుతున్న వారు కంగారు పడ్డారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కిషోర్‌ ప్రాణాలు పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. యువకుడి హఠాన్మరణంతో.. అతను ఉంటున్న ప్రాంతంలో విషాదం నెలకొంది. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట( Chilakaluripeta)లో జరిగింది.  మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో షటిల్ ఆడుతున్న కిషోర్ గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. ఆ నిమిషంలోనే అతని ప్రాణాలు పోయాయి. కిషోర్‌ ఫ్రెండ్స్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. హఠాత్తుగా గుండెపోటు రావడం, తలలో నరాలు తెగిపోవటం వంటి సందర్భాల్లో ఇలా జరుగుతుందని డాక్టర్లు తెలిపారు. మృతుడు కిశోర్… చిలకలూరిపేట మున్సిపల్ మాజీ ఛైర్మన్, దివంగత మల్లెల బుచ్చయ్య మనవడు అని తెలిసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి