Andhra Pradesh: అధిక వడ్డీల పేరుతో కుచ్చుటోపి.. కోటిన్నరతో పరారైన దంపతులు.. వర్షంలో బాధిత మహిళల ఆందోళన

| Edited By: Ravi Kiran

Oct 07, 2022 | 6:30 AM

తక్కువ టైమ్‌లో ఎక్కువ వడ్డీ వస్తుందన్న ఆశతో కష్టపడి సంపాదించిన మొత్తాన్ని ఆ కిలాడీ దంపతుల చేతిలో పెట్టారు గ్రామస్తులు. పది లక్షలో, ఇరవై లక్షలో కాదు, ఏకంగా కోటిన్నర రూపాయలను వాళ్ల చేతిలో పోశారు. ఇప్పుడు, మోసం చేశారంటూ ఇదిగో ఇలా వానలో తడుస్తూ ఆందోళన చేస్తున్నారు.

Andhra Pradesh: అధిక వడ్డీల పేరుతో కుచ్చుటోపి.. కోటిన్నరతో పరారైన దంపతులు.. వర్షంలో బాధిత మహిళల ఆందోళన
Women Protest
Follow us on

అధిక వడ్డీలకు ఆశపడి ఊరు ఊరే మోసపోయింది. తక్కువ టైమ్‌లో ఎక్కువ వడ్డీ అంటూ జనాలకు కుచ్చుటోపీ పెట్టేశారు కిలాడీ దంపతులు. నాగులుప్పలపాడు మండలం చదలవాడలో ఈ ఘరానా మోసం జరిగింది. తక్కువ టైమ్‌లో ఎక్కువ వడ్డీ వస్తుందన్న ఆశతో కష్టపడి సంపాదించిన మొత్తాన్ని ఆ కిలాడీ దంపతుల చేతిలో పెట్టారు గ్రామస్తులు. పది లక్షలో, ఇరవై లక్షలో కాదు, ఏకంగా కోటిన్నర రూపాయలను వాళ్ల చేతిలో పోశారు. ఇప్పుడు, మోసం చేశారంటూ ఇదిగో ఇలా వానలో తడుస్తూ ఆందోళన చేస్తున్నారు. తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బు సంపాదన. అది కూడా ఈజీ మనీయే టార్గెట్‌. పెద్దగా కష్టపడకుండానే లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు కొల్లగొట్టేయాలన్నదే కేటుగాళ్ల లక్ష్యం. అందుకోసం జనాన్ని ఏమార్చడమే వాళ్ల పని. జనాలు ఏ విషయంలో టెంప్ట్‌ అవుతారో, దాన్నే ఆయుధంగా ఎంచుకుంటారు మోసగాళ్లు. ఇక్కడా అదే జరిగింది. అధిక వడ్డీతో డబ్బు వసూలుచేసి రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేశారు మద్దెల శామ్యూల్‌ దంపతులు. దీంతో రెండ్రోజులుగా వర్షంలో తడుస్తూనే శామ్యూల్‌ ఇంటి ముందు ఆందోళనకు దిగారు బాధితులు. ఎలాగైనా తమ డబ్బు తమకు ఇప్పించండి అంటూ అధికారులను వేడుకుంటున్నారు.

బాధిత మహిళల కథనం ప్రకారం గతంలో చదలవాడ గ్రామ సర్పంచిగా పోటీచేసి ఓడిపోయిన మద్దెల శామ్యూల్, ఆయన భార్య కృష్ణవేణి ఘరానా మోసానికి పాల్పడ్డారు. అధిక వడ్డీ ఆశచూపి వారు పలువురు మహిళల వద్ద నుండి దాదాపు కోటి రూపాయల నగదు, అర కోటి విలువైన బంగారు ఆభరణాలను తీసుకున్నారు. తదుపరి డబ్బులు నగలు ఇతర మహిళలు తాము ఇచ్చినివి తమకు తిరిగి ఇవ్వమని కోరగా ముఖం చాటేసి తిరుగుతున్నారు. పైగా బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఎంతకీ ప్రయోజనం లేకపోవడంతో మహిళలు ప్రత్యక్ష ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..