Vijayawada: క్రీడా ప్రతినిధితో ఆడిన విధి..! 22 ఏళ్లకే ఉన్నత స్థాయి ఉద్యోగం.. బెజవాడ అబ్బాయితో పెళ్లి.. చివరకు

|

Feb 02, 2023 | 8:00 AM

ఉన్నతస్థాయి ఉద్యోగస్తురాలామె.. అయినా సరే అత్తారింటి వేధింపులు తప్పడం లేదు. పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేదు. దీంతో తనకు న్యాయం చేయమంటూ.. మీడియా ముందుకొచ్చారామె..

Vijayawada: క్రీడా ప్రతినిధితో ఆడిన విధి..! 22 ఏళ్లకే ఉన్నత స్థాయి ఉద్యోగం.. బెజవాడ అబ్బాయితో పెళ్లి.. చివరకు
Crime News
Follow us on

ఉన్నతస్థాయి ఉద్యోగస్తురాలామె.. అయినా సరే అత్తారింటి వేధింపులు తప్పడం లేదు. పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేదు. దీంతో తనకు న్యాయం చేయమంటూ.. మీడియా ముందుకొచ్చారామె. ఎక్కడ జరిగిందీ ఘటన? పంజాబ్‌కు చెందిన షాయాజ్ భానుకు విజయవాడకు చెందిన మహబూబ్ షరీఫ్ తో ఏడాదిన్నర క్రితం పెళ్లయ్యింది. ఇండియన్ యూత్ స్పోర్ట్స్ అంబాసిడర్‌గా పని చేస్తున్న ఆమె.. ఇరవై లక్షల కట్నం ఇచ్చిన మరీ షరీఫ్‌ను పెళ్లాడారు. ఈ పెళ్లి మూడునాళ్ల ముచ్చటే అయ్యింది. భారీ ఎత్తున ఆస్తులున్నాయని పెళ్లాడిన షరీఫ్.. బండారం మూడురోజులకే బయట పడింది. తర్వాత డబ్బు తేవల్సిందేనంటూ వరకట్న వేధింపులు మొదలయ్యాయి. రెండు సార్లు అబార్షన్లు సైతం జరిగాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

తాను యూత్ ఎక్చేంజీలో పరీక్ష రాసి ఆరో ర్యాంకు సంపాదించాననీ.. ప్రధాని రాష్ట్రపతి అవార్డులు, రివార్డులను సైతం అందుకున్నానని షాయాజ్ భాను తెలిపారు. 22ఏళ్లకే సీనియర్ ఆఫీసర్ కేటగిరిలో సెలెక్టయిన తనకే ఇలా జరగడం ఏంటో అర్ధం కావడం లేదని వాపోతున్నారు బాధితురాలు. తన భర్త వేధింపులపై తాను పడమట పోలీస్టేషన్లో కంప్లయింట్ చేశాననీ. అయినా సరే న్యాయం జరగలేదనీ. అందుకే మీడియా ముందుకు రావల్సి వచ్చిందని అంటున్నారు బాధితురాలు.

తన జీవితాన్ని నాశనం చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని పటమట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అయితే, ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదంటూ షాయాజ్ భాను ఆవేదన వ్యక్తంచేశారు. తనకు న్యాయం జరగాలనే మీడియా ముందుకు వచ్చినట్లు బాధితురాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..