కట్టుకున్నవాడే కాలయముడు.. అనుమానంతో భార్య దారుణ హత్య.. పూర్తి వివరాలు

|

Feb 26, 2022 | 1:19 PM

కడదాకా తోడండాల్సిన భర్తే.. ఆమె పాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త విచక్షణ కోల్పోయాడు. తరచూ ఆమెతో గొడవ పడేవాడు. అతని వేధింపులు తాళలేక...

కట్టుకున్నవాడే కాలయముడు.. అనుమానంతో భార్య దారుణ హత్య.. పూర్తి వివరాలు
Daughter Murder
Follow us on

కడదాకా తోడండాల్సిన భర్తే.. ఆమె పాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త విచక్షణ కోల్పోయాడు. తరచూ ఆమెతో గొడవ పడేవాడు. అతని వేధింపులు తాళలేక భార్య వేరుగా ఉంటోంది. దీంతో మరింత అనుమానం పెంచుకున్న భర్త.. భార్యపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితురాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి(death) చెందింది. నెల్లూరు(Nellore) జిల్లా వెంకటాచలం మండలంలోని చవటదళితవాడకు చెందిన బాలపెంచలయ్య, సీతమ్మలు దంపతులు. అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో అనుమానం చిచ్చు రేపింది. దంపతుల మధ్య బేధాలు వచ్చాయి. అనుమానంతో సుజాతను బాల పెంచలయ్య తరచూ వేధిస్తుండేవాడు. వివాదాలు మరీ ఎక్కువ కావడంతో రెండేళ్లుగా ఒకే ఇంట్లో వేర్వేరుగా ఉంటున్నారు.

భార్యపై మరింత అనుమానం పెంచుకున్న బాలపెంచలయ్య.. గురువారం రాత్రి ఆమె వంట చేస్తున్న సమయంలో కత్తితో దాడి చేశాడు. సుజాత గట్టిగా కేకలు వేయటంతో స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి తీవ్రంగా గాయపడిన సుజాతను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడిన బాల పెంచలయ్యను అదుపులోకి తీసుకున్నారు.

Also Read

Hyderabad: ‘భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటాల్సిన బాధ్యత యువతపై ఉంది’.. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ..

వారిని స్వస్థలాలకు తరలించే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.. నితీశ్ కుమార్ ప్రకటన

Viral Video: టీవీ చూస్తున్న కుక్క.. ఒక్కసారిగా ఏం చేసిందో తెలుసా ?? వీడియో