AP Weather: ఆవర్తనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన

|

Nov 06, 2024 | 2:09 PM

ఏపీలోని పలు ప్రాంతాలకు రెయిన్ అలెర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి...

AP Weather: ఆవర్తనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన
Andhra Weather Report
Follow us on

దక్షిణ మధ్య బంగాళాఖాతం పై సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్, యానాం లో దిగువ ట్రోపో ఆవరణం లో ఉత్తర / ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాబోయే 3 రోజులు వాతావరణ సూచలను తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
————-

బుధవారం, గురువారం, శుక్రవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణము కంటే 2 నుండి 4 డిగ్రీలు అధికము గా నమోదు అయ్యే అవకాశము ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
————-

బుధవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణము కంటే 2 నుండి 4 డిగ్రీలు అధికము గా నమోదు అయ్యే అవకాశము ఉంది.

గురువారం, శుక్రవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ :-
————

బుధవారం :-  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణము కంటే 2 నుండి 4 డిగ్రీలు అధికము గా నమోదు అయ్యే అవకాశము ఉంది.

గురువారం, శుక్రవారం: – తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..