AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఈ అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అమరావతి కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా వెళ్తుందని తెలిపింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Heavy Rains

Updated on: Nov 14, 2023 | 7:19 AM

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 16 నాటికి మధ్య మరియు ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసింది. దీంతో  ఆంధ్రప్రదేశ్, కేరళ, లక్షద్వీప్, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌తో సహా దేశంలోని పలు ప్రాంతాలకు వర్షపాత హెచ్చరికలను జారీ చేసింది.

ఈ అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అమరావతి కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా వెళ్తుందని తెలిపింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దిశగా పయనిస్తుందని, ఈ నెల 16 నాటికి వాయుగుండగా మారే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి కేంద్రం వార్నింగ్‌ ఇచ్చింది.

అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉంటుందని, ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్ప పీడన ప్రాంతం ఏర్పడటంతో  మత్స్యకారులు సముద్రం మీదకు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us