రెండు అట్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత.. మరో చెత్త సినిమా ఇది..!

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా ఆయన ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. అయితే తాజాగా టీడీపీ తలపెట్టిన ఛలో ఆత్మకూరు యాత్రపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. గతంలో ఎన్టీఆర్- కథానాయకుడు, మహానాయకుడు పేర్లతో తీయుంచుకున్న రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయని తెలిపారు. అయితే మొన్న ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. ఇప్పుడు “ఛలో ఆత్మకూరు” అనే చెత్త సినిమా వదిలారంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. సంక్షేమ […]

రెండు అట్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత.. మరో చెత్త సినిమా ఇది..!
Follow us

| Edited By:

Updated on: Sep 13, 2019 | 10:58 AM

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా ఆయన ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. అయితే తాజాగా టీడీపీ తలపెట్టిన ఛలో ఆత్మకూరు యాత్రపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. గతంలో ఎన్టీఆర్- కథానాయకుడు, మహానాయకుడు పేర్లతో తీయుంచుకున్న రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయని తెలిపారు. అయితే మొన్న ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. ఇప్పుడు “ఛలో ఆత్మకూరు” అనే చెత్త సినిమా వదిలారంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో సీఎం జగన్ దూసుకెళ్తుంటే.. చంద్రబాబు మాత్రం ఏడుపుగొండి చర్యలతో మరింత పతనమవుతున్నారని విమర్శించారు.