Watch: విశాఖ నుంచి బయలుదేరిన కాసేపటికే రైలు నుంచి దట్టమైన పొగ.. చివరకు ఏం జరిగిందంటే..

| Edited By: Shaik Madar Saheb

Sep 22, 2024 | 11:39 AM

నడుస్తున్న రైలులో అకస్మాత్తుగా దట్టమైన పొగలు.. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.. ఈ ఘటన బెంగళూరు - గౌహతి ఎక్స్ప్రెస్ లో కలకలం రేపింది.. ఎస్ 7 భోగిలో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు చైన్ లను లాగి రైలును నిలిపివేశారు..

Watch: విశాఖ నుంచి బయలుదేరిన కాసేపటికే రైలు నుంచి దట్టమైన పొగ.. చివరకు ఏం జరిగిందంటే..
Train
Follow us on

నడుస్తున్న రైలులో అకస్మాత్తుగా దట్టమైన పొగలు.. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.. ఈ ఘటన బెంగళూరు – గౌహతి ఎక్స్ప్రెస్ లో కలకలం రేపింది.. ఎస్ 7 భోగిలో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు చైన్ లను లాగి రైలును నిలిపివేశారు.. విశాఖ నుంచి బయలుదేరిన కాసేటికే ఈ ఘటన చోటుచేసుకోవడంతో గందరగోళం నెలకొంది.. రైలు సింహాచలం స్టేషన్లో దాదాపు గంటపాటు నిలిచిపోయింది.. వివరాల ప్రకారం.. విశాఖ నుంచి బయకుదేరిన బెంగళూరు – గౌహతి ఎక్స్ ప్రెస్ రైలు.. కాసేటికే సింహాచలంలో ఆగిపోయింది. రైలు బోగీ నుంచి పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. బెంగళూరు – గౌహతి ఎక్స్ప్రెస్ ఎస్7 భోగిలో నుంచి దట్టంగా పొగలు వెలువడ్డాయి. సింహాచలం రైల్వేస్టేషన్లో హాల్ట్ లేకపోయినప్పటికీ ప్లాట్ఫారంపై రైలు ఆగింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా భయంతో రైలు నుంచి కిందకి దిగిపోయారు. ఆ ప్రయత్నంలో స్వల్ప గందరగోళం, తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బందితో కలిసి పొగలు వ్యాపించిన భోగిని పరిశీలించారు. సాంకేతిక లోపంతో వీల్స్ బ్రేక్ షూస్ పట్టేసినట్లు గుర్తించారు. మరమ్మతులు చేసి బోగీలో వ్యాపించిన పొగలను నియంత్రించారు.

వీడియో చూడండి..

బ్రేక్ బైండింగ్ కావడంతో స్మోక్ వచ్చినట్టు గుర్తించి అధికారులు మరమ్మత్తులు చేయడంతో దాదాపు గంట తరువాత రైలు బయలుదేరింది. ఆస్తి, ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. విజయనగరం, శ్రీకాకుళం వెళ్లాల్సిన కొంత మంది ప్రయాణికులు అప్పటికే దిగి రోడ్డు మార్గన వెళ్ళిపోయారు. బెంగళూరు – గౌహతి ఎక్స్ ప్రెస్ రైలు కాస్త ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..