విశాఖ బీచ్‌రోడ్‌లో మాజీ మంత్రి కుమారుడు హల్‌చల్ చేశాడు. మితిమీరిన వేగంతో కారును నడుపుతూ ఓ బైక్‌ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు, అతడి ముగ్గురు స్నేహితులు ఓ కారులో బీచ్ రోడ్‌లో వెళ్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న వారి కారు డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి.. ఓ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి గాయాలు కాగా.. కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. వెంటనే అప్పలనాయుడు గుర్తించిన స్థానికులు దేహశుద్ధి చేసినట్లు సమాచారం. ఇక పోలీసులు వచ్చే సమయానికి అతడు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. కాగా కారులో అప్పలనాయుడుతో పాటు రిటైర్డ్ డీఐజీ కుమారుడు, మరో ఇద్దరు ఉండగా.. వారిలో మౌర్య, ప్రవీణ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు అతడి ర్యాష్ డ్రైవింగ్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా ఢీకొట్టినట్లు సమాచారం. మరోవైపు పరారీలో ఉన్న అప్పలనాయుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.