అంబేద్కర్‌కు అవమానం

| Edited By: Anil kumar poka

Oct 17, 2019 | 5:02 PM

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం. దీనికి రాజ్యాంగాన్ని అందించిన ప్రపంచ మేధావి బాబాసాహెబ్‌ డాక్టర్ బిఆర్‌ అంబేద్కర్‌. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక్క భారతదేశంలో అణగారిన వర్గాల కోసమే పాటుపడలేదని,.. యావత్ ప్రపంచంలో ఆయారూపాల్లో అణచివేతకు గురయిన దీనుల కోసం కూడా కష్టపడ్డారని ప్రపంచ దేశాలు గుర్తించి ఆయన్ను ఆరాధిస్తున్నాయి. కానీ, మన దేశంలో మాత్రం కొందరు ఆయన పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో అంబేద్కర్ కు […]

అంబేద్కర్‌కు అవమానం
Follow us on

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం. దీనికి రాజ్యాంగాన్ని అందించిన ప్రపంచ మేధావి బాబాసాహెబ్‌ డాక్టర్ బిఆర్‌ అంబేద్కర్‌. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక్క భారతదేశంలో అణగారిన వర్గాల కోసమే పాటుపడలేదని,.. యావత్ ప్రపంచంలో ఆయారూపాల్లో అణచివేతకు గురయిన దీనుల కోసం కూడా కష్టపడ్డారని ప్రపంచ దేశాలు గుర్తించి ఆయన్ను ఆరాధిస్తున్నాయి. కానీ, మన దేశంలో మాత్రం కొందరు ఆయన పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో అంబేద్కర్ కు ఘోర అవమానం జరిగింది.  ఇరగవరం మండలం కావలిపురం గ్రామంలో కొందరు గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహానికి పాదరక్షలు దండను వేసి అవమానపరిచారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన స్థానికులు మండిపడ్డారు..అక్కడకు చేరుకున్న ప్రజాసంఘాల నాయకులు, దళితులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ విగ్రహన్ని శుభ్రం చేసిన పాలతో అభిషేకం చేశారు. పూలమాల వేసి నివాళులర్పించారు.