AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతా అమ్మవారి మహిమ..! వరలక్ష్మీ పూజ తర్వాత బంగారాన్ని డ్రైనేజీ కాలువలో పారేశారు.. కట్ చేస్తే..

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారికి అలంకరించిన బంగారు ఆభరణాలు పొరపాటున డ్రైనేజీ కాలువలో పడిపోయాయి. సుమారు 5 తులాల బంగారం కోసం ఆందోళన చెందిన కుటుంబానికి పోలీసులు అండగా నిలిచారు. జేసీబీ సాయంతో కాలువలో నీటి ప్రవాహాన్ని మళ్లించి గాలింపు చేపట్టగా.. చెల్లాచెదురుగా పడిన హారం, బ్రాస్లెట్, గొలుసులు, ఉంగరాలు ఒక్కొక్కటిగా లభించాయి. విశాఖపట్నం శ్రీనగర్‌లో జరిగిన ఈ ఘటనలో పోలీసులు బంగారాన్ని సురక్షితంగా కుటుంబానికి అప్పగించారు.

అంతా అమ్మవారి మహిమ..! వరలక్ష్మీ పూజ తర్వాత బంగారాన్ని డ్రైనేజీ కాలువలో పారేశారు.. కట్ చేస్తే..
Visakhapatnam Gold Recovery
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Aug 25, 2026 | 8:46 PM

Share

పూజ చేసాక.. పోయిన బంగారం తిరిగి చేతికి వచ్చేసరికి ఆ కుటుంబం కళ్ళలో ఆనందం పట్టలేనిది. పోలీసుల చొరవతో.. ఎట్టకేలకు ఆ బంగారం దొరికింది. గోల్డ్ డ్రైనేజీ కాలువలో కనిపించడంతో.. ఆ కుటుంబానికి అవధులు లేకుండా పోయాయి.. ఈ ఘటన ఎక్కడో కాగు.. విశాఖ శ్రీనగర్ లో జరిగింది. పూజ బంగారం కాలువలోకి ఎలా వెళ్లింది..? ఎలా దొరికింది..? అనేగా డౌట్.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.. గాజువాక శ్రీనగర్ కు చెందిన ఉడుముల రమేష్, దివ్య దంపతులు. ఈ నెల 21న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సుమారు 8 తులాల బంగారు ఆభరణాలను అమ్మవారికి అలంకరించారు. ఆనవాయితీ ప్రకారం 3 రోజుల పాటు అమ్మవారి వద్దనే ఆభరణాలు ఉంచారు. ఆ తరువాత రమేష్.. అమ్మవారి పై ఉన్న 3 తులాల హారం, కాసు మాత్రమే తీసుకొని.. పువ్వుల మధ్యలో ఉన్న మిగతా 5 తులాల బంగారు ఆభరణాలు చూసుకోలేదు. 1 బ్రాస్లెట్, 2 గొలుసులు, 3 ఉంగరాలు.. తీయడం మర్చిపోయి పూజకు ఉపయోగించిన పువ్వులు, ఇతర సామాగ్రిని ఎర్రటి వస్త్రంతో సహా చుట్టారు. అయిదు తులాల బంగారు ఆభరణాలతో సహా ఆ పూజా సామాగ్రిని దుర్గా నగర్ వద్ద గల స్టీల్ ప్లాంట్ రైల్వే బ్రిడ్జి కింద పారే డ్రైనేజీ కాలువలో పడవేశారు.

ఇంటికి తిరిగి వచ్చాక..

ఇంటికి వచ్చిన తర్వాత బంగారం కనిపించకపోవడంతో భార్య దివ్య గమనించి భర్తకు తెలిపింది. దింతో వాళ్లు మళ్ళీ వెంటనే తిరిగి వెళ్లి కాలువలో వెతికినా బంగారం కనిపించలేదు. తీవ్ర ఆందోళనతో స్టీల్ ప్లాంట్ పిఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

Visakhapatnam Gold Recovery

Visakhapatnam Gold Recovery

వెంటనే స్పందించిన సిఐ కేశవరావు.. ఒక కానిస్టేబుల్, హోమ్ గార్డులను ఘటనా స్థలానికి పంపించారు. జేసీబీ సహాయంతో డ్రైనేజీ నీటి ప్రవాహాన్ని మళ్లించి, నీటి ప్రవాహం తగ్గిన తర్వాత కాలువలో క్షుణ్ణంగా గాలింపు చేపట్టారు. ఈ సమయంలో కొంత దూరంలో చల్లచెదురుగా పడి ఉన్న ఆభరణాలు ఒక్కొక్కటిగా దొరికాయి. దొరికిన ఆభరణాలను సురక్షితంగాతీసుకొచ్చి బాధితులైన దివ్య, రమేష్ దంపతులకు పోలీసులకు అప్పగించారు. పోలీసుల తక్షణమే స్పందించి బంగారం వెతికి పెట్టినందుకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. పండుగలు, పూజల సమయంలో విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ సిఐ కేశవరావు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అదృష్టం అంటే ఇదే.. పూజ బంగారం కాలువలో దొరికింది..
అదృష్టం అంటే ఇదే.. పూజ బంగారం కాలువలో దొరికింది..
సాంగ్ అంటే ఇది.. నెట్టింట దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.
సాంగ్ అంటే ఇది.. నెట్టింట దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.
కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త రూల్స్ ఇవే
కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త రూల్స్ ఇవే
అబద్ధం చెప్పిన గంభీర్‌.. కట్‌చేస్తే.. షాకివ్వనున్న బీసీసీఐ?
అబద్ధం చెప్పిన గంభీర్‌.. కట్‌చేస్తే.. షాకివ్వనున్న బీసీసీఐ?
స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. సీన్ కట్‌చేస్తే..
స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. సీన్ కట్‌చేస్తే..
బిగ్‌ బాస్‌ 10లో జబర్దస్త్ స్టార్ కమెడియన్.. 100 శాతం కన్ఫార్మ్
బిగ్‌ బాస్‌ 10లో జబర్దస్త్ స్టార్ కమెడియన్.. 100 శాతం కన్ఫార్మ్
అతి ఆలోచనకు చెక్ పెట్టి.. మనశ్శాంతిగా జీవించడం నేర్పించే కథ!
అతి ఆలోచనకు చెక్ పెట్టి.. మనశ్శాంతిగా జీవించడం నేర్పించే కథ!
పర్సనల్ లోన్ మీకు ఎంత వస్తుంది..? ఈజీగా చెక్ చేసుకోండి
పర్సనల్ లోన్ మీకు ఎంత వస్తుంది..? ఈజీగా చెక్ చేసుకోండి
బాడీ షేమింగ్‌ కామెంట్ కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన దేశ ప్రధాని
బాడీ షేమింగ్‌ కామెంట్ కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన దేశ ప్రధాని
నల్లగా ఉందని రిజెక్ట్ చేశారు.. స్టార్ హీరోలే క్యూ కట్టిన బ్యూటీ..
నల్లగా ఉందని రిజెక్ట్ చేశారు.. స్టార్ హీరోలే క్యూ కట్టిన బ్యూటీ..