AP News: చిల్డ్‌‌బీర్ తాగుతూ చిల్ అవుదామనుకున్నాడు.. కట్ చేస్తే.. సీన్ సితారయ్యింది

|

Jan 01, 2025 | 7:16 AM

బియ్యం కేసుతో అట్టుకుతున్న బందర్‌లో మరో స్కామ్‌ తెరపైకి వచ్చింది. లిక్కర్‌ షాప్‌లు టార్గెట్‌గా నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాకు చెక్‌ పెట్టారు మచిలీపట్నం పోలీసులు. దొంగ నోట్ల దందా ఎవరి అండతో?.. ఆ పాయింట్‌పై ఫోకస్‌ పెట్టారు పోలీసులు.

AP News: చిల్డ్‌‌బీర్ తాగుతూ చిల్ అవుదామనుకున్నాడు.. కట్ చేస్తే.. సీన్ సితారయ్యింది
Chilled Beer
Follow us on

లిక్కర్‌ షాప్‌లే టార్గెట్‌గా దొంగ నోట్ల చెలామణికి స్కెచ్ వేసిన ముఠాకు మచిలీపట్నం పోలీసులు చెక్‌ పెట్టారు. ఓ వైన్‌ షాప్‌లో నకిలీ 5 వందల నోట్లను మారుస్తుండగా కన్నెగంటి మోహన్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ. 7500 విలువ చేసే 15 ఫేక్ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో కూపీ లాగితే ప్రింటింగ్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ డొంక కదిలింది. కన్నెగంటి మోహన్‌ ఇచ్చిన సమాచారంతో వీరాచారి, సత్యనారాయణ, శివ ప్రసాద్‌లను అరెస్ట్ చేశారు పోలీసులు. నకిలీ నోట్ల తయారీకి ఉపయోగిస్తున్న ప్రింటర్, ఇతర పరికరాలు సీజ్‌ చేశారు. వీరి నుంచి రూ. 6600 విలువ చేసే మూడు రూ. 200 నోట్లు, ఆరు రూ. 500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ దందా ఎప్పటి నుంచి చేస్తున్నారు? వీళ్ల వెనుక ఇంకా ఎవరున్నారనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్నారు డీఎస్పీ అబ్దుల్‌ సుభాన్. త్వరలోనే మిగతా నిందితులను కూడా అరెస్ట్‌ చేస్తామన్నారు. రోజుకు కనీసం 30 వేల నకిలీ నోట్లను చెలామణి చేయాలనే టార్గెట్‌తో ఈ దందా చేస్తున్నట్టు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను అభినందించారు డీఎస్పీ అబ్దుల్‌ సుభాన్. ఫేక్‌ కరెన్సీ మార్కెట్‌లోకి డంప్‌ కాకుండా నిందితులను అరెస్ట్‌ చేశామన్నారు. పరారీలో వున్న మరికొందరు నిందితులను కూడా మరికొద్ది రోజుల్లో పట్టుకుంటామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి