బ్రేకింగ్.. : భక్తులకోసం సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ..!

తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా చెక్ పెట్టింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా మన దేశంలో కూడా దీని ప్రభావం ఉండటం.. గత రెండు రోజుల్లో ఇద్దరు వ్యక్తులు కరోనా ఎఫెక్ట్‌తో మరణించడంతో.. టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి.. శ్రీవారి దర్శనానికి భక్తులను […]

బ్రేకింగ్.. : భక్తులకోసం సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ..!
T
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2020 | 5:58 PM

తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా చెక్ పెట్టింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా మన దేశంలో కూడా దీని ప్రభావం ఉండటం.. గత రెండు రోజుల్లో ఇద్దరు వ్యక్తులు కరోనా ఎఫెక్ట్‌తో మరణించడంతో.. టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి.. శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు టీటీడీ పేర్కొంది.

ఇక విశేషపూజ, సహస్త్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం సేవలకు సంబంధించి.. ముందుగా బుకింగ్ చేసుకున్న భక్తులకు.. వేరే తేదీలు మార్చుకునేలా.. లేదంటూ బ్రేక్ దర్శనంకు వెళ్లే వెసులుబాటును తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. మరోవైపు కరోనా నివారణ కోసం.. శ్రీ శ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహాయాగంను నిర్వహించనున్నట్లు టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.